Begin typing your search above and press return to search.
'పరువు' హత్య కాదు...'పరువు' తీసే హత్య!
By: Tupaki Desk | 16 Sep 2018 10:23 AM GMTమిర్యాల గూడలో ప్రణయ్ దారుణ హత్య నేపథ్యంలో `పరువు హత్య`ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇరు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పదం ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఈ తరహా పరువు హత్యలు ఎక్కువగా...ఇంతకన్నా ఘోరంగా అక్కడ జరుగుతున్నాయి. అక్కడ ఇంతకు మించిన మూర్ఘులున్నారు. ఇంకా చెప్పాలంటే మూర్ఘుల మందలున్నాయి. ఖాప్ పంచాయితీలు....కుల పంచాయితీలు ఉత్తరాదిలో ఎక్కువ. ఇక - పొరుగు దేశం పాకిస్థాన్ లో ఆ హత్యల శాతం మరింత ఎక్కువ. ప్రపంచంలో ఈ తరహా హత్యల ఉద్దేశం ఒకటే....తాము హంతకులమైనా....ఉన్మాదులుగా మారినా.....సమాజంలో తమ `పరువు` మాత్రం పోకూడదు. ఆ హత్యలు చేసినంత మాత్రాన వారు పాకులాడుతున్న పరువు వారికి దక్కడం లేదన్నది కఠోర వాస్తవం. ఈ నేపథ్యంలోనే అసలు `పరువు` హత్య అన్న పదంపై కొంతమంది విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయించి...దానిని పరువు కాపాడుకునేందుకు చేసిన హత్యగా చిత్రీకరించడం సరికాదని వారు అంటున్నారు.
మిర్యాలగూడలో జరిగిన దారుణ హత్యకు ‘పరువు హత్య’ అని గౌరవప్రదమైన పేరు పెట్టడం ఎందుకని కొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అత్యంత అమానవీయంగా...అతి కిరాతకంగా జరిగిన ఓ దారుణ హత్యని ‘పరువు హత్య అనడం సరికాదన్నారు. దళితులపై జరుగుతున్న అరాచకాలపై ఏమాత్రం సానుభూతి - సామాజిక స్పందన లేదన్న విషయాన్ని ఆ పదం సూచిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. కుల దురంహకారమే ప్రణయ్ ను పొట్టనబెట్టుకుందని దళిత కార్యకర్తలు- డాక్టర్ పసునూరి రవీందర్ - దునా అంబేడ్కర్ - యెగ్గోని జయరాజ్ అన్నారు. కులవాద - మతవాద శక్తులే ఆ దారుణ హత్యను `పరువు` హత్య అంటాయని - సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిందనడానికి ఈ హత్య తాజా ఉదాహరణ అని వారన్నారు. పిల్లలు తినే తిండి నుంచి ప్రేమ వరకు తల్లిదండ్రుల ఆంక్షలు విధించడం సరికాదని - ప్రేమించిన పాపానికి చంపడం ఏమిటని - ఇలా చంపుకుంటూ పోతే కనడమెందుకు? అని హెచ్ సీయూ ప్రొఫెసర్ సుజాతా సూరేపల్లి ఫేస్ బుక్ పోస్టు లో ప్రశ్నించారు. అది `పరువు` హత్య కాదు.. `పరువు` తీసే హత్య అని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ అన్నారు.