Begin typing your search above and press return to search.

ఇక్కడ దాసరి.. అక్కడ ఆమె

By:  Tupaki Desk   |   31 May 2017 10:35 AM GMT
ఇక్కడ దాసరి.. అక్కడ ఆమె
X
ఓవైపు తెలుగు సినీ పరిశ్రమ అంతా దాసరి మరణంతో విషాదంలో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సినీ ప్రేమికుడు దాసరి మరణంతో విలాపంలో ఉన్నాడు. అదే సమయంలో అటు కన్నడ సినీ పరిశ్రమలోనూ ఒక విషాదం చోటు చేసుకుంది. కన్నడ సినీ ప్రేక్షకులు దేవుడిలాగా భావించే రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ చనిపోయారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతమ్మ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో పార్వతమ్మ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు వారాల పాటు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కొన్ని రోజులుగా ఆమె వెంటిలేటర్ మీదే ఉంటున్నారు. చివరికి బుధవారం చనిపోయారు. ఆమె వయసు 78 సంవత్సరాలు.

రాజ్ కుమార్ దశాబ్దం కిందటే చనిపోయిన సంగతి తెలిసిందే. భర్త రాజ్‌కుమార్‌ తరహాలోనే పార్వతమ్మ కూడా తన రెండు కళ్లను దానం చేశారు. రాజ్‌కుమార్‌-పార్వతమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. అందులో ఇద్దరు సినీ రంగ ప్రవేశం చేశారు. శివరాజ్ కుమార్ తో పాటు పునీత్ రాజ్ కుమార్ కన్నడలో పెద్ద హీరోలుగా ఎదిగారు. భర్త సహకారంతో పార్వతమ్మ అనేక సినిమాల్ని కూడా నిర్మించారు. భర్త మరణానంతరం అనారోగ్యానికి గురైన పార్వతమ్మ.. కొంత కాలంగా మంచానికే పరిమితం అయి ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/