Begin typing your search above and press return to search.

నాటకీయంగా ప్రత్యక్షమైన పరంబీర్ సింగ్..!

By:  Tupaki Desk   |   26 Nov 2021 2:30 AM GMT
నాటకీయంగా ప్రత్యక్షమైన పరంబీర్ సింగ్..!
X
ముంబై, ఠాణె పోలీస్ కమిషనర్ గా పని చేసిన పరంబీర్ సింగ్ గత కొద్దిరోజులుగా కన్పించకుండా పోయాడు. ఆయనకు, మహారాష్ట్ర హోమంత్రికి వివాదం నడుస్తున్న తరుణంలోనే తనకు ప్రాణహానీ ఉందంటూ పరంబీర్ సింగ్ కొద్దిరోజులుగా క్రితం కామెంట్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఆయన కన్పించకుండా పోవడం ముంబైలో సంచలనంగా మారింది.

పరంబీర్ సింగ్ వ్యాఖల నేపథ్యంలో ప్రస్తుత ముంబై హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే స్పందించారు. ఒక్క ఐపీఎస్ అధికారి తనకు ప్రాణహానీ ఉందని కామెంట్ చేయడం తనకు షాకింగ్ కు గురిచేసిందన్నారు. అయితే ఆయన కన్పించకుండాపోవడంతో పరంబీర్ సింగ్ దేశం విడిచి వెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పరంబీర్ సింగ్ ఇటీవల కోర్టు విచారణకు సైతం హాజరు కాలేదు. దీంతో బాంబే మెజిస్ట్రేట్ కోర్టు అతడిని పరారీలో ఉన్ననేరస్థుడిగా ప్రకటించింది. ఈనేపథ్యంలో పరంబీర్ సింగ్ తరుపు న్యాయవాది బలవంతపు వసూళ్ల కేసులో అతడికి రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పరంబీర్ సింగ్ ఎక్కడ ఉన్నారో చెబితేగానీ పిటిషన్ విచారణ చేపట్టబోమని, అంతేకాకుండా ఆయనకు రక్షణ కల్పించబోమని సుప్రీం తేల్చిచెప్పింది. దీంతో పరంబీర్ సింగ్ దిగొచ్చారు. తనకు ప్రాణ హానీ ఉన్నందున ఛత్తీస్గడ్ లో ఉన్నట్లు తెలిపాడు. తనకు రక్షణ కల్పిస్తే కోర్టుకు హాజరవుతానని వెల్లడించారు. దీంతో కోర్టు ఆయనకు రక్షణ కల్పిస్తున్నామని అభయం ఇచ్చింది.

దీంతో గురువారం ఆయన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యారు. కేసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశించడంతో ఆయన అంగీకరించాడు. తనకు న్యాయ స్థానంపై నమ్మకం ఉందని తనపై వచ్చిన ఆరోపణలను కోర్టులోనే తేల్చుకుంటానని పరంబీర్ సింగ్ స్పష్టం చేశాడు.