ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 9996 కేసులు 82 మంది మృతి !

Thu Aug 13 2020 17:00:07 GMT+0530 (IST)

Pandemic boom in AP .. 9,996 new cases, 82 dead!

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి గత రికార్డ్స్ బద్దలు కొడుతూ కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 9996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 82 కరోనా మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. తాజగా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 264142కి చేరింది. అలాగే ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2378కి పెరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు కరోనా నుంచి 170924 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 90840 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 55692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఇక జిల్లాల వారీగా నమోదు అయిన కరోనా కేసుల్ని ఒకసారి చూస్తే.. అనంతపురంలో 856 చిత్తూరులో 963 తూర్పు గోదావరిలో 1504 గుంటూరులో 595 కడపలో 784 కృష్ణాలో 330 కర్నూలులో 823 నెల్లూరులో 682 ప్రకాశంలో 681 శ్రీకాకుళంలో 425 విశాఖలో 931 విజయనగరంలో 569 పశ్చిమ గోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461 ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.