Begin typing your search above and press return to search.

పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. పోలింగ్​ ప్రారంభం..!

By:  Tupaki Desk   |   9 Feb 2021 3:52 AM GMT
పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. పోలింగ్​ ప్రారంభం..!
X
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ తొలిదశ పోలింగ్​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్​ జరుగనున్నది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్​ ప్రారంభమైంది. ఈ సారి ఎన్నికల కమిషన్​ చైర్మన్​ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కరోనా పేషెంట్లను ఓట్లు వేసేందుకు అనుమతిస్తున్నారు. అయితే వాళ్లు చివరగా పోలింగ్​ కేంద్రాల దగ్గరకు చేరుకోవాలని ఆయన సూచించారు.

ఈ సారి తొలిసారిగా నోటాకు కూడా అవకాశం ఇచ్చారు. శ్రీకాకుళం - టెక్కలి - పాలకొండ - అనకాపల్లి - కాకినాడ - పెద్దాపురం - నర్సాపురం - విజయవాడ - తెనాలి - ఒంగోలు - కావలి - నంద్యాల - కర్నూలు - కదిరి - జమ్మలమడుగు - కడప - రాజంపేట - చిత్తూరు రెవెన్యూ డివిజన్లలోని.. మొత్తం 3,249 పంచాయతీ సర్పంచ్‌ - 32,502 వార్డులకు పోలింగ్‌ జరుగుతున్నది.

వీటిలో 525 సర్పంచ్‌, 12,185 వార్డులు ఏక గ్రీవమయ్యాయి.2,723 సర్పంచ్‌ - 20,157 వేలకు పైగా వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. 29,732 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్​ కొనసాగుతోంది. అయితే ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ ఇవాళ పలు పోలింగ్​ కేంద్రాలను పర్యవేక్షించనున్నట్టు సమాచారం.