Begin typing your search above and press return to search.
జడ్పీ - ఎంపిటీసీ ఏకగ్రీవాలు కూడా రద్దు చేస్తారా?
By: Tupaki Desk | 5 Feb 2021 3:30 PM GMTపోయిన సంవత్సరం మార్చిలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలు రద్దు కాబోతున్నాయా ? స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలి చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. గతఏడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలను పక్కన పెట్టమని ఆదేశించారు. అంతకుముందే విజయవాడ ప్రాంతంలో ఏకగ్రీవాలు జరిగిన జడ్పీ, ఎంపీటీసీ ప్రాంతాల్లోని అధికారులను బదిలీ చేయాలని ఆదేశాలిచ్చారు.
మామూలుగా జరిగే ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకం కాదని కానీ బలవంతపు ఏకగ్రీవాలను మాత్రం సహించేది లేదని వార్నింగులిస్తున్నారు. అయితే స్వచ్చంద ఏకగ్రీవాలని, బలవంతపు ఏకగ్రీవాలని వేర్వేరుగా ఉండదు. ఏకగ్రీవాలను వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు గనుక ఫిర్యాదులు చేస్తే ఇక ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాల్సిందేనా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. నామినేషన్లు వేసేందుకు ముందుకు రానీ టీడీపీ లేదా ఇతర పార్టీల నేతలు తర్వాత ఫిర్యాదులు చేస్తే ఏకగ్రీవాలను రద్దు చేస్తారా ? అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పోయిన ఎన్నికల్లో దాదాపు 23 శాతం జడ్పీ, ఎంపిటీసీ స్ధానాలు ఏకగ్రీవాలయ్యాయి. 2014లో ఇన్ని ఏకగ్రీవాలు కాలేదు కాబట్టి 2020లో జరిగిన ఏకగ్రీవాలన్నీ బెదిరించి బలవంతంగా వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకున్నారని చంద్రబాబునాయుడు, నిమ్మగడ్డ ఒకే పద్దతిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే 2014 పరిస్ధితులు వేరు 2020 పరిస్ధితులు వేరన్న విషయాన్ని కావాలనే వాళ్ళు మరుగున పరుస్తున్నారు.
2014లో జనరల్ ఎలక్షన్స్ కు ముందు స్ధానిక ఎన్నికలు జరిగాయి కాబట్టి తమ సత్తా నిరూపించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు గట్టి పట్టుదలతో ఏకగ్రీవాలకు అంగీకరించలేదు. కాబట్టి చాలా స్ధానాల్లో ఎన్నికలు జరిగాయి. అదే 2020 వచ్చేసరికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి లేవలేని పరిస్ధితిలో పడిపోయింది. మిగిలిన ప్రతిపక్షాలు అసలు సోదిలోనే లేవు. కాబట్టి వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి.
స్ధానిక ఎన్నికల్లో పోటీ చేసేంత సీన్ తమకు లేదని స్వయంగా మాజీఎంపి జేసీ దివాకర్ రెడ్డే మీడియా సమావేశంలో ప్రకటించారు. ఐదేళ్ళు అధికారంలో ఉండబోయే వైసీపీ నేతలతో గొడవలు పెట్టుకుని ఎవరు వీపులు పగలగొట్టుకుంటారని జేసీ నే పార్టీ పరిస్ధితేమిటో చెప్పేశారు. చంద్రబాబు పుట్టిపెరిగిన చంద్రగిరిలోనే ఎంపిటీసీ, జడ్పీటీసీ స్ధానాల్లో పోటీకి నేతలు ముందుకురాలేదన్నది వాస్తవం. కాబట్టే వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలయ్యాయి. ఇపుడు ఇటువంటి ఏకగ్రీవాలన్నింటినీ నిమ్మగడ్డ రద్దు చేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అప్పటి ఏకగ్రీవాలను ఎన్నికల అధికారులే ప్రకటించారు. మరిపుడు రద్దు చేయటం సాధ్యమవుతుందా ? చూద్దాం ఏం జరుగుతుందో.