Begin typing your search above and press return to search.
పంచాయతీ ఎన్నికల్లో ఎవరిది పైచేయి? గత ఫలితాలేంటి?
By: Tupaki Desk | 5 Feb 2021 4:45 AM GMTఎట్టకేలకు ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్నాయి.. అసెంబ్లీ ఎన్నికలంతా పోరు ఉండకపోయినా వీటిని అంత ఈజీగా తీసుకోవద్దని అధికార, ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలిచి అధికారంలో కూర్చుంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అవకాశం దొరికితే తమ ప్రతాపం చూపిద్దాం అన్నట్లుగా చూస్తోంది. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికలు రావడం ఆ పార్టీ నాయకులకు బ్రహ్మస్ర్తంగా మారింది. ముఖ్యంగా ఏపీలోని పశ్చిమ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల గత గ్రాఫ్ చూస్తే సైకిల్ కే సై అన్నట్లుగా ఉంది. రెండు మాడుసార్లు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీనే గెలిపించిన దాఖలాలు ఉన్నాయి.
2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉంది. 2013లో పంచాయతీ ఎన్నికల్లో పశ్చిమ ప్రాంత జిల్లాల్లో చాలా చోట్ల టీడీపీ పాగా వేసింది. ఇప్పడూ టీడీపీ ప్రతిపక్షస్థానంలోనే ఉంది. వైసీపీ పై నిత్యం పోరాటం చేస్తున్న టీడీపీనే గ్రామీణులు గెలిపించనున్నారా..? అనే చర్చ జరుగుతోంది. గత సాధారణ ఎన్నికల్లోనూ పశ్చిమ నియోజకవర్గాల్లో టీడీపీ ఓటు బ్యాంకు అధికంగానే సంపాదించుకుంది. పట్టణాల్లో వైసీపీకి మద్దతు ఎక్కువగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పసుపు జెండాను కోరుకునేవారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణ ఎన్నికల్లో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలను గెలుసుకున్న వైసీపీకి ఇక్కడ పంచాయతీ పోరులో ఎదురుగాలి తప్పట్లే లేదంటున్నారు. ఇక చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, పోలవరంతో పాటు గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ తన బలం ఇప్పటికే పెంచుకుంటూ వస్తోంది. ఈ ప్రాంతాల్లో టీడీపీ ఇన్ చార్జులుగా ఉన్నవారు తమ పార్టీ బలోపేతం కోసం నిత్యం క్రుషి చేస్తుండడంతో ఆ పార్టీ క్యాడర్ పెరుగుతూనే ఉంది. దీంతో ఏపీలోని పశ్చిమ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూల వాతావరణమే ఉందని చెప్పవచ్చు.
సాధారణ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికలు భిన్నంగానే ఉంటున్నాయి. ప్రధాన పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. దీంతో ఆచంటలో మంత్రి రంగనాథరాజు, మాజీ మంత్రి పితాని పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. రంగనాథరాజుపై సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకతను పితాని క్యాష్ చేసుకుంటున్నారు.
అయితే నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లాంటి చోట్ల టీడీపీ ఇన్ చార్జులు చతికిలబడిపోయారు. ఇక్కడ బీజేపీ, జనసేనలు ఓట్లు చీల్చడంతో అధికార పార్టీకే లాభం చేకూరనున్నట్లు కనిపిస్తోంది. ఇక ఏలూరు పార్లమెంటరీ టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలైనా సరే తమ జెండా ఎగిరేరాలా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా పశ్చిమ ప్రాంతంలో ఈసారి పంచాయతీ పోరులో టీడీపీ ఎంతమేరకు మెజారిటీ సాధిస్తుందో చూడాలి..