Begin typing your search above and press return to search.

సీఎం మేనమామ నియోజకవర్గం లో ఓటుకు 8000!!

By:  Tupaki Desk   |   5 Feb 2021 3:48 AM GMT
సీఎం మేనమామ నియోజకవర్గం లో ఓటుకు 8000!!
X
ఏపీలో మరోసారి ఎన్నికల పండుగొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన పార్టీలన్నీ ఇప్పుడు పల్లెల్లో పంచాయతీ ఎన్నికలకు రెడీ అయిపోయాయి. గ్రామంలో పరపతి, హోదా కోసం నేతలు ఎంతైనా ఖర్చుపెడుతున్నారు. ప్రెసిడెంట్ పదవికి లక్షలు ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా.. పలు ప్రాంతాల్లో ఓటుకు రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు ఇస్తున్నారు.

తాజాగా ఫుల్ టైట్ ఉన్న పంచాయతీల్లో రేటు అమాంతం పెరిగిపోతోంది. రియల్ భూమ్ ఉన్న గ్రామాలు.. సిటీలకు ఆనుకొని ఉన్న పల్లెలు, పారిశ్రామిక ప్రాంతాలున్న గ్రామాల్లో ఎంతైనా ఖర్చు చేయడానికి నేతలు వెనుకాడడం లేదు.

తాజాగా కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ పంచాయతీలో సర్పంచ్ పదవిని జనరల్ కు కేటాయించారు. 2వ దశలో ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఈ క్రమంలోనే బడా బాబు తనను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే 240 ఓట్లకు గాను రూ.20 లక్షలు చెల్లిస్తానని సంచలన ప్రకటన చేసినట్టు సమాచారం. ఈ డబ్బుతో గ్రామంలో అభివృద్ధి కాకుండా ఓక్కో ఓటరుకు పంచేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. దీన్ని ఓటుకు రూ.8వేల వరకు ఆ అభ్యర్థి పంచుతున్నట్టు అర్థమవుతోంది.