Begin typing your search above and press return to search.
ఓటుకు నోట్లు.. డబ్బుపంచుతూ దొరికిపోయిన బీజేపీ నేతలు..!
By: Tupaki Desk | 4 Feb 2021 9:15 AM GMTఏపీలో ‘పంచాయతీ’ హీట్ మొదలైంది. ఇప్పటికే తొలిదశ నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. దీంతో వివిధ పార్టీల నేతలు ప్రలోభాలకు తెరతీశారు. మనదేశంలో ఎన్నికలంటనే డబ్బుతో ముడిపడిన వ్యవహరంలో మారింది. ఇక పంచాయతీ ఎన్నికలు.. వార్డు ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అయితే నెల్లూరు జిల్లా అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారు. స్థానికులు వద్దంటున్నా వాళ్ల ఇంటికి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నారు. ఓటర్లు నిద్రిస్తుంటే వాళ్ల ఇంట్లోకి డబ్బు వెదజల్లి పోతున్నారు. దీంతో కొందరు గ్రామస్థులు ఏకంగా అధికారులకు మొరపెట్టుకున్నారు. డబ్బులు ఇస్తే.. ఆ తర్వాత అభివృద్ధి పనులు చేయించుకోలేమని వాళ్లు అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీ నేతలు ఓటుకు నోట్లు వ్యవహరానికి తెరతీయడం నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కావలి, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల పరిధిలో 63 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 386 మంది సర్పంచ్ పదవికి నామినేషన్లు వేశారు. అయితే ఇక్కడ బీజేపీ తరఫున నామినేషన్లు వేసిన వాళ్లు కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ. 5 వేలు ఇవ్వాడానికి సిద్ధపడ్డారు. కావలి మండలం లక్ష్మీపురం పంచాయతీలోని గిరిజనులకు ఓటుకు రూ. 5వేలు ఇస్తూ పట్టుబడ్డారు బీజేపీ నేతలు లక్ష్మీపురం గ్రామపంచాయతీలో బీజేపీ నేతలు రూ. 1.24 లక్షలు పంచిపెట్టారు. అయితే ఈ గ్రామం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్కుమార్ది కావడం గమనార్హం. గ్రామంలో మొత్తం రూ.1.24 లక్షలు గిరిజనులకు పంచారు.
అయితే వాళ్లు వద్దంటున్నా ఇంటికి వెళ్లి డబ్బులు పంచారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. జనవరి 31వ తేదీ అర్థరాత్రి కొందరు బీజేపీ నేతలు గ్రామంలోకి వెళ్లి అక్కడి గిరిజనులకు డబ్బులు పంచారు. వాళ్లు వద్దంటున్నా మంచాలమీద పెట్టారు. దీంతో గిరిజనులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు లక్ష్మీపురం గ్రామానికి చేరుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంచినవారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.