Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డ ఉచ్చులో ఇరుక్కుపోయాడా?
By: Tupaki Desk | 3 Feb 2021 6:36 AM GMTక్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. రాజ్యాంగబద్దమైన అధికారాలని, కోర్టు నుండి మద్దతు దొరుకుతోందన్న కారణాలతో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు వెనుక చూసుకోకుండా రెచ్చిపోతున్నారు. అయితే ఆ స్పీడుకు హఠాత్తుగా బ్రేకులు పడబోతోందా ? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రివిలేజ్ కమిటి రూపంలో నిమ్మగడ్డకు ఇబ్బందులు తప్పేట్లులేదు.
ప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం ముదిరి పాకానపడింది. ఒకళ్ళపై మరొకళ్ళు ఆధిపత్యం చెలాయించుకునే గోలలో ఒకరిది ఒకసారి పై చేయంటే మరోసారి ఇంక్కోళ్ళది అవుతోంది. తనకు రాజ్యాంగ పరిధిలో ఉన్న రక్షణతో న్యాయస్ధానం మద్దతుతో ప్రభుత్వంపై నిమ్మగడ్డ రెచ్చిపోతున్నారు. విధిలేని పరిస్దితిలో ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ ఆదేశాల్లో కొన్నింటిని అమలు చేస్తోంది. తన ఆదేశాలను ప్రభుత్వం ఆమోదిస్తోందంటే వేరేదారి లేకే అన్న విషయం నిమ్మగడ్డకు బాగా తెలుసు.
ఆ విషయాన్ని గుర్తుంచుకుని నిమ్మగడ్డ కాస్త సంయమనంతో వ్యవహరించుంటే బాగుండేది. అనవసరంగా ఉన్నతాధికారులపై అభిశంసనకు ఆదేశాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యతలనుండి తప్పించటం, సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా తీసేయమని ఆదేశించటం లాంట చర్యలకు దిగారు. తన అధికారాలకు తిరుగేలేదు అన్న పద్దతిలో చివరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ మీద గవర్నర్ కు ఫిర్యాదు చేయటంతో కత క్లైమ్యాక్స్ కు చేరుకునేలా చేసింది.
నిజానికి నిమ్మగడ్డను అదికారపార్టీ కావాలనే ఉచ్చులోకి లాగింది. మంత్రులతో నిమ్మగడ్డపై కావాలనే తీవ్రమైన ఆరోపణలు చేయించింది. అయితే యంత్రాంగం మీద ఒంటికాలిపై లేస్తున్నట్లే మంత్రులపైన కూడా చాలా తేలిగ్గా గవర్నర్ కు ఫిర్యాదు చేసేశారు. మామూలుగా అయితే యంత్రాంగంపై తనిష్టం వచ్చినట్లు చర్యలు తీసుకునే అవకాశం నిమ్మగడ్డకుంది. అయితే మంత్రులపై యాక్షన్ తీసుకోలేడన్న విషయం తెలిసే మంత్రులను ఎరగా వేశారు. ఆ ఎరకు కమీషనర్ తగులుకున్నారు. తన ఆదేశాలను పాటించకపోతే కోర్టుకెళ్ళే నిమ్మగడ్డకు ఇక్కడ అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. నిమ్మగడ్డపై సభా హక్కుల ఉల్లంఘనంటు మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
మంత్రుల నుండి వచ్చిన ఫిర్యాదును వెంటనే స్పీకర్ హక్కుల కమిటికి పంపించి విచారణ చేయమన్నారు. విచారణలో నిమ్మగడ్డదే తప్పని కమిటి దాదాపు తేల్చేసింది. రెండోసారి సమావేశం అయిన తర్వాత నిమ్మగడ్డకు కమిటి నోటీసు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. తన ఎదుట హాజరై సంజాయిషీ చెప్పుకోమని నోటీసు ఇవ్వబోతున్నదట కమిటి. అందుకు నిమ్మగడ్డ హాజరైతే ఒక పద్దతి హాజరుకాకపోతే మరో పద్దతి.
పద్దతి ఏదైనా సంజాయిషీతో సంతృప్తి చెందకపోతే కమిటి అదే విషయాన్ని స్పీకర్ కు చెబుతుంది. వెంటనే స్పీకర్ నిమ్మగడ్డపై యాక్షన్ కు ఆదేశిస్తారు. అప్పుడు నిమ్మగడ్డ ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ నిమ్మగడ్డ అరెస్టుకు స్పీకర్ ఆదేశిస్తే అప్పుడేమవుతుంది ? నిమ్మగడ్డ మహా అయితే కోర్టుకెళతారు ? స్పీకర్ ఆదేశాల విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదని గతంలోనే రుజువైంది. ప్రివిలేజ్ కమిటి ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. కాబట్టి ప్రభుత్వం పన్నిన ఉచ్చులో నిమ్మగడ్డ పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ?