Begin typing your search above and press return to search.

పాలకుర్తి ఎస్ ఐ ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు? ఆయనేం చేశారు?

By:  Tupaki Desk   |   2 Jan 2021 10:45 AM GMT
పాలకుర్తి ఎస్ ఐ ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు? ఆయనేం చేశారు?
X
పోలీసు అన్నంతనే వెన్నులో నుంచి వణుకు వస్తుంది. వీలైనంతవరకు వారికి కాస్త దూరంగా ఉండాలనే భావనకు చెక్ పెట్టటం.. పోలీసులు మనలాంటి వారే.. మనకుసాయం చేయటానికే వారు ఉన్నారన్న భావన కలిగించటమే కాదు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పుణ్యమా అని ప్రజల్లో ఖాకీల మీద ఉన్న ఫీలింగ్ మారిందని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తుఅయితే.. తాజాగా ఒక తెలంగాణ పోలీసు అధికారి గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇంతటి ఔదర్యం కోట్లల్లో ఒక్కరికి ఉంటుందేమో అన్న భావన కలుగుతుంది.

ఇంతకీ ఆ పోలీసు అధికారి ఎవరంటే.. వరంగల్ జిల్లాలోని పాలకుర్తి ఎస్ఐ గుండ్రాతి సతీశ్. అతని పెద్ద మనసు ఎంతన్న విషయం కొత్త సంవత్సరం సందర్భంగా బయటకు వచ్చింది. ఆ మధ్యన కురిసిన వర్షాలకు ఒక పేద మహిళ ఇల్లు పూర్తిగా కూలిపోయింది. దీంతో.. అతడి మనసు వికలమైంది. ఆ పేద మహిళ ఇంటిని తిరిగి నిర్మించే బాధ్యతను తీసుకున్న ఆయన.. తాజాగా ఒక ఇంటిని కట్టించి ఇచ్చారు.

కొత్త సంవత్సరం వేళ.. కొత్తగా కట్టించి ఇచ్చిన ఇంటికి పేద మహిళ చేత గృహప్రవేశం చేయించారు. దీంతో ఆ మహిళ సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. ఇలా మనసుతో ఆలోచించే పోలీసులు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఏమైనా.. పాలకుర్తి ఎస్ఐకు మనస్ఫూర్తిగా శభాష్ చెప్పాల్సిందే. మీరేం అంటారు?