Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ లో పాల్గొనడం పై పాక్ కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   8 July 2023 6:58 PM GMT
ప్రపంచ కప్ లో పాల్గొనడం పై పాక్ కీలక నిర్ణయం!
X
కొద్దిరోజుల క్రితం వన్డే వరల్డ్ కప్ లో తాము ఆడబోయే వేదికల ను మార్చాలని బీసీసీఐ, ఐసీసీలను పాకిస్తాన్ కోరడం పై ఆ దేశ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ స్పందించిన సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా తాము క్రికెట్ ఎక్కడ, ఎప్పుడు ఆడినా మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉండాల ని బాబర్ తెలిపాడు. ఈ క్రమంలో పాక్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.

అవును... భారత్ లో జరిగే వన్ డే వరల్డ్ కప్ - 2023లో పాల్గొనే విషయం పై పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ టోర్నీలో పాల్గొనాలా వద్దా అనే విషయం పై నిర్ణయం తీసుకునేందుకు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో - జర్ధారీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ని పాక్ ఏర్పాటు చేసిందని తెలుస్తుంది.

అయితే ఈ కమిటీ ఆగస్టు నెల లో భారత్ లో పర్యటించి నివేధిక అందించనుందని తెలుస్తుంది. అనంతరం ప్రపంచకప్ లో పాకిస్థాన్ పాల్గొనే విషయం పై ఆ దేశం నిర్ణయం వెళ్లడించనుందని తెలుస్తుంది. అయితే ఇవి పూర్తిగా రక్షణ కు సంబంధించిన సంగతులా అనే విషయం పై ఆన్ లైన్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి!!

క్రికెట్ లో టోర్నీ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు అనేది తెలిసిన విషయమే. ఈ మ్యాచ్ లపై కేవలం ఈ ఇరుదేశాల క్రికెట్ అభిమానులే కాకుండా... ప్రపంచం మొత్తం మీదా క్రికెట్ అభిమానుల కు ఆసక్తి ఉంటుంది. ఈ క్రేజ్ కు కొనసాగింపా అన్నట్టుగా దాయాది దేశాల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరుగనుంది.

కాగా... ఈ విషయాల పై స్పందించిన పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్... భారత్ కు వెళ్లేది ప్రపంచకప్ ఆడటానికే తప్ప ఇండియాతో మాత్రమే ఆడటానికి కాదని... భారత్ తో పాటు మరో 8 టీమ్స్ తో పాకిస్థాన్ తలపడనుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయం లో... ఒక ఆటగాడిగా, సారథిగా ప్రతి దేశం లోనూ, ఆడిన ప్రతి మైదానం లో పరుగులు సాధిస్తూ పాకిస్తాన్ ను గెలిపించడం మీదే తాను దృష్టి సారిస్తాను అని చెప్పుకున్నాడు.

ఇలా పాక్ క్రికెటర్ ఎన్ని చెప్పుకున్నా... ఫైనల్ గా బిలావల్ భుట్టో - జర్ధారీ నేతృత్వం లో ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం అనంతరమే... పాకిస్థాన్ క్రికెట్ టీం ఇండియాకు వచ్చేది, వరల్డ్ కప్ లో ఆడేది ఫైనల్ అవ్వబోతోందన్నమాట!