Begin typing your search above and press return to search.

3 అంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షల ఖర్చు పెట్టాడు .. ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   21 Jan 2021 6:30 AM GMT
3 అంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షల ఖర్చు పెట్టాడు .. ఏమైందంటే ?
X
దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందక , లేని దానికోసం ఆరాటపడే వారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా రంగు , రూపం , డబ్బు విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే , కష్టపడితే డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ రంగు , రూపం అనేవి దేవుడు ఇచ్చిన వరం. అయితే , ఓ వ్యక్తి తాను ఉన్న ఎత్తు కంటే ఇంకా కొంచెం ఎత్తు పెరగాలి అని భావించి ,ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 55 లక్షలు ఖర్చు పెట్టాడు. అయితే ఆ వ్యక్తి అనుకున్నది జరిగిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

అమెరికాలోని డల్లాస్‌ కు చెందిన ఆల్ఫోన్సో ఫ్లోరెస్‌ అనే 28 ఏళ్ల వ్యకి ఐదు అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండేవారు. అయితే అతను ఉన్న ఎత్తుతో అతడు సంతృప్తి పడలేదు. మరింత ఎత్తు పెరగాలనుకున్నాడు. ఇందుకోసం లాస్‌ వెగాస్ ‌లోని డాక్టర్‌ కెవిన్‌ డెబీపర్షద్ ‌ను సంప్రదించాడు. ఆయన అతడకి లింబ్‌ లెంథ‌నింగ్’ కాస్మటిక్‌ సర్జరీని చేయించుకోవాల్సిందా సూచించారు. ఆల్ఫోన్సో ఇందుకు అంగీకరించాడు. ఆపరేషన్‌ పూర్తయింది. ఏకంగా 55 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంతకు ముందు కంటే మూడు అంగుళాల ఎత్తు పెరిగాడు.

ఐదు అడుగుల 11 అంగుళాలు ఉన్న అతడు ఆరు అడుగుల 1 అంగుళానికి చేరుకున్నాడు. గత ఆగస్టులో ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతడు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌కు గురికాకుండా ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే ఇలాంటి కాస్మటిక్‌ సర్జరీలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్‌ను చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2016లో హైదరాబాద్‌కు చెందిన నిఖిల్‌ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెరగటానికి సర్జరీ చేయించుకుని తీవ్ర ఇ‍బ్బందుల పాలైన సంగతి తెలిసిందే.