Begin typing your search above and press return to search.

కేసీఆర్ గురువుగారు ఇక లేరు

By:  Tupaki Desk   |   5 July 2017 5:43 AM GMT
కేసీఆర్ గురువుగారు ఇక లేరు
X
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు వేద‌న క‌లిగించే అంశ‌మిది. ప్ర‌ముఖ పండితుడు.. తొలిత‌రం క‌థా ర‌చ‌యిత‌.. సీఎం కేసీఆర్‌ కు గురువు అయిన ఉమాప‌తి ప‌ద్మ‌నాభ శ‌ర్మ క‌న్నుమూశారు. 90 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న మంగ‌ళ‌వారం సిద్ధిపేట‌లో క‌న్నుమూశారు.

సంస్కృత పండితుడిగా.. బ‌హుమ‌ఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న ఆయ‌న ఎన్నో అధ్యాత్మిక గ్రంథాల్ని ర‌చించారు. సాహితీ రంగంలో విశిష్ట సేవ‌లు అందించిన ప‌ద్మ‌నాభ శ‌ర్మ మ‌ర‌ణం గురించి సమాచారం అందుకున్న కేసీఆర్ తీవ్ర దిగ్భాంత్రిని వ్య‌క్తం చేశారు.

సాహితీ లోకానికి ఆయ‌న సేవ‌ల‌కు గుర్తింపుగా ఇటీవ‌ల రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ విశిష్ట పుర‌స్కారాన్ని ఆయ‌న అందుకున్నారు. గురువుగారి మ‌ర‌ణానికి త‌న సంతాపాన్ని తెలియ‌జేసిన కేసీఆర్‌..ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌ద్మ‌నాభ శ‌ర్మతో త‌న‌కున్న అనుబంధాన్ని.. సాహితీ లోకానికి ఆయ‌న చేసిన సేవ‌ను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.