Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ లో కియాకార్ల సందడి అదిరిపోయిందట

By:  Tupaki Desk   |   14 Jun 2021 5:36 AM GMT
ప్రగతిభవన్ లో కియాకార్ల సందడి అదిరిపోయిందట
X
ఆదివారం ప్రగతిభవన్ లో కొత్త కియా కార్ల సందడి మామూలుగా లేదు. ఒకేసారి ఒకేలాంటి కొత్త కార్లు పెద్ద ఎత్తున పార్కు చేసిన వైనం అందరిని ఆకర్షించింది. అదనపు కలెక్టర్ల కోసం వీటిని తెప్పించారు. తెలంగాణలోని మొత్తం32 జిల్లాలకు సంబంధించిన అదనపు కలెక్టర్లకు పెద్ద పీట వేస్తానని చెబుతున్న కేసీఆర్.. వారి గౌరవ మర్యాదలకు ఏ మాత్రం కొరత ఉండదని చెప్పటం తెలిసిందే. త్వరలో వారందరికి కొత్త భవనాల్ని కూడా కట్టి ఇస్తామని చెప్పటం తెలిసిందే.

ఆదివారం అదనపు కలెక్టర్లు.. డీపీవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి 32 జిల్లాల అదనపు కలెక్టర్లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. అదనపు కలెక్టర్లు రాత్రిళ్లు పల్లెల్లో బస చేయాలని.. ఉదయం లేచి జనంలో తిరిగితే సమస్యలు తెలుస్తాయని చెప్పారు. ఇందుకోసం వారికి కొత్త వాహనాల్ని సిద్ధం చేసినట్లుగా చెప్పారు.సమీక్షా సమావేశం వేళ.. అదనపు కలెక్టర్లకు ఇచ్చే కియా కార్లను పరిశీలించారు. ఒక్కో వాహనం ఖరీదు రూ.30 లక్షల వరకు ఉంటుందని.. ఇందుకోసం రూ.9కోట్లకు పైగా నిధుల్ని మంజూరు చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్తగా తీసుకొచ్చిన కియా కార్ల విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల కియా కార్ల లోగో మారింది. దీనికి సంబంధించిన కార్లు హైదరాబాద్ రోడ్ల మీదకువచ్చేశాయి. మార్చిన లోగోతో వచ్చిన కార్లకు బదులుగా.. అదనపు కలెక్టర్ల కోసం తెప్పించిన బ్రాండ్ న్యూ కార్లు పాత లోగోతో ఉండటం గమనార్హం. దీన్ని చూస్తే.. కార్ల లోగో ఆధారంగా కొత్త కార్లు పాత మోడల్ వి కానీ.. లోగో మారకముందు మార్కెట్లోకి వచ్చిన కార్లను తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. అన్నేసి లక్షలు పోసి కొనుగోలు చేసే వేళలో..అప్డేట్ గా ఉండేట్లు చూసుకుంటారు కదా. మరి.. ఆ విషయాన్ని అధికారులు ఎక్కడ మిస్ అయ్యారన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.