Begin typing your search above and press return to search.
చిన్నారుల హత్య కేసులో వీడిన మిస్టరీ
By: Tupaki Desk | 20 March 2021 5:30 AM GMTమనిషి రూపంలో ఉన్న ఓ మానవ మృగం చిన్నపిల్లలను తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఉపయోగించుకుని వారిని దారుణంగా హత్యలు చేశాడు. తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో ఈనెల 14న అదృశ్యమైన కుర్రా భార్గవతేజ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో స్పష్టం కావటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన మెల్లెంపూడి గోపి నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ ఈశ్వరరావుతో కలిసి అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నిందితుడు గోపిని మీడియా ఎదుట హాజరుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గోపి నిందితుడని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
గత నెల 11న వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి అఖిల్, కూడా అదృశ్యం కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఆచూకీ తెలియలేదు. బకింగ్ హామ్ కెనాల్ లో పడి ఉంటాడని భావించి విస్తృతంగా గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. భార్గవతేజ కేసు తీరులోనే ఇదీ ఉండటంతో పోలీసులు గోపిని విచారించగా, అఖిల్ ను కూడా తానే హతమార్చినట్టు అంగీకరించాడు. ఇద్దరినీ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు, అనంతరం గొంతు నులిమి చంపేసినట్టు చెప్పాడు. మృతిచెందిన తర్వాత కూడా మరోసారి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపాడు.
దారుణ నేరాలకు పాల్పడిన నిందితుడిపై వీలైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేసి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలతో అఖిల్ మృతదేహం కోసం బకింగ్ హామ్ కాల్వలో గాలిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తులో భాగంగా మెల్లెంపూడి గోపిపై అనుమానంతో అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, గ్రామ వీఆర్ ఓ ద్వారా పోలీస్ స్టేషన్ లో హాజరయ్యాడని వెల్లడించారు. నిందితుడు తన సహచరులతో కలిసి స్వలింగ సంపర్కం చేసేవాడని, వారిని కూడా గుర్తించి సాక్షులుగా చూపుతామన్నారు. కాగా గోపి తండ్రి శ్రీనివాసరావు తన మొదటి భార్యను కిరోసిన్ పోసి హత్య చేయగా ఆ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదు అనుభవించి వచ్చాడు.