Begin typing your search above and press return to search.
ఇంతకూ మాజీ మంత్రి సతీమణి సీడీ చూశారా?
By: Tupaki Desk | 4 Sep 2016 3:44 PM GMTదేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన (శనివారం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు) మాజీ మంత్రి సందీప్ పటేల్ సెక్స్ టేపు ఉదంతంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలతో మాజీ మంత్రిగారి రాసలీలల్ని చూసిన (?) ఆ పార్టీ అధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెనువెంటనే ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే. టేపులో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయటం.. తనకు రేషన్ కార్డు ఇప్పించేందుకు నమ్మించి తనపై అత్యాచారం చేసినట్లుగా ఆరోపించటం తెలిసిందే.
మరో మహిళకు పెళ్లి అయ్యిందని.. తాజా టేపుతో తన పరిస్ధితి దారుణంగా మారిందంటూ వాపోతోంది. సీడీతో అడ్డంగా బుక్ అయిన మాజీ మంత్రిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన సతీమణి ఆయనకు బాసటగా నిలిచారు. ఇంత దారుణంగా బుక్ అయ్యాక సందీప్ ను అందరూ దోషిగా చూస్తున్న వేళ.. ఆయన సతీమణి రీతూ కుమార్ అండగా నిలిచారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని.. తన భర్త నిర్దోషిగా వ్యాఖ్యానించారు.
కుట్రతో తన భర్తను ఈ కేసులో ఇరికించినట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. రేషన్ కార్డు కోసం మాజీ మంత్రి ఇంటికి వెళ్లిన వేళ.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసిన మహిళ ఫిర్యాదు కుట్రపూరితంగా రీతూ కొట్టి పారేశారు. సీడీలో అయ్యగారి బాగోతం స్పష్టంగా కనిపిస్తున్నా.. అదేమీ పట్టనట్లుగా భర్తకు బాసటగా నిలిచిన రీతూ తీరును తప్పు పడుతున్నారు. ‘‘సీడీ తర్వాత కూడా భర్త తప్పు చేయలేదని ఎలా చెబుతోంది?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏమో.. అందరి కంట పడిన సీడీలోని సన్నివేశాల్ని రీతూ చూడలేదేమో..?