Begin typing your search above and press return to search.
మతధర్మం:జాబ్ పోగొట్టుకున్న ఎయిర్ హోస్టెస్
By: Tupaki Desk | 8 Sep 2015 10:51 AM GMTకూటి కోసం కోటి తిప్పలు అంటారు. వృత్తిధర్మానికి.. మత ధర్మాన్ని అస్సలు సంబంధమే లేకున్నా.. ఒక ఎయిర్ హోస్టెస్ చిత్రమైన వాదనతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న పరిస్థితి. ఉద్యోగాన్ని.. మతాన్ని లింకేసి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకుండా జాబ్ పోగొట్టుకున్న ఆమె.. అందుకు కారణమైన ఎయిర్ లైన్స్ కంపెనీ మీద ఫిర్యాదు చేసింది.
ప్రయాణికులకు లిక్కర్ సర్వ్ చేయలేదన్న కారణంగా తనను సస్పెండ్ చేసినట్లుగా ఆమె వాపోతుంది. తాను ఒక ముస్లిం మహిళనని.. తన మతధర్మం ప్రకారం మద్యం అందించటం సరికాదని.. అందుకే తాను సరఫరా చేయలేదని పేర్కొంటోంది. డెట్రాయిట్ కు చెందిన చారీ స్టాన్లే చేస్తున్న ఈ చిత్రమైన వాదన విని ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు మహిళ అమెరికాకు చెంది ఎక్స్ ప్రెస్ జెట్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తుంది.
నిజానికి మతధర్మం మీద అంత కచ్ఛితమే ఉంటే.. మద్యం అందించాలన్న ఉద్యోగంలోకే రాకుండా.. అందుకు భిన్నమైన వృత్తిని ఎంచుకోవాల్సి ఉంది. అయినా.. అలాంటిదేమీ పట్టని ఆమె.. తనకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతోంది. మరోవైపు.. ఈమె వాదన గురించి కంపెనీ వివరణ ఇస్తూ.. ఆమెకు అంత నమ్మకాలే ఉంటే.. లిక్కర్ సర్వ్ చేసే పనిని తన తోటి వారికి చెప్పి.. తన ఇబ్బందిని వివరించి అడ్జెస్ట్ చేసుకుంటే సరిపోయేది కానీ.. అలాంటిదేమీ లేకుండా ప్రయాణికులకు అసౌకర్యం కలిగించటం ఏమిటని ప్రశ్నిస్తుంది. చేసేది వ్యాపారమైనప్పుడు.. అది బాగా జరిగితేనే ఆదాయం వచ్చి.. జీతాలు వచ్చేటప్పుడు.. ఆ పనిని సంపూర్ణంగా నిర్వహించాల్సిన ధర్మం ఉద్యోగిపై ఉంది. లేదంటే..నమ్మకాలు ఎక్కువనుకుంటే.. తాను నమ్మిన ధర్మానికి తగ్గ ఉద్యోగం చూసుకోవాలే కానీ ఇదేందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.