Begin typing your search above and press return to search.
భార్యతో బలవంతంపు శృంగారం నేరం కాదంటోన్న కోర్టు
By: Tupaki Desk | 13 Aug 2021 4:30 PM GMTఈ మధ్య కాలంలో కొందరు న్యాయమూర్తులు ఇచ్చిన కొన్ని తీర్పులు మహిళలపై జరిగే అకృత్యాలను అరికట్టేవిగా ఉంటే....మరికొన్ని మృగాళ్లకు ఊతమిచ్చేలా ఉంటున్నాయి. మహిళకు ఇష్టం లేకుండా ఆమె శరీరంపై పురుషాంగంతో ఎక్కడ తాకినా రేప్ కిందకే వస్తుందంటూ కేరళ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చింది. మారిటల్ రేప్ చట్టరీత్యా నేరం కాదన్న చట్టాన్ని సవరించాలని, కానీ, ఆ కారణంతో మహిళ విడాకులు అడిగితే ఇచ్చే హక్కు కోర్టులకుందని కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది.
అయితే, ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే కేరళ హైకోర్టు తీర్పునకు పూర్తి భిన్నంగా ముంబైలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. భార్యకు ఇష్టం లేకున్నా భర్త సెక్స్ చేయవచ్చని, అసలు భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్దం కాదని ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘరత్ ఇచ్చిన సంచలన తీర్పు పెనుదుమారం రేపుతోంది. ఈ కేసు నిలబడదని, నిందితుడైన భర్త చట్టవిరుద్ధమైన పనిచేశాడో లేదో చెప్పలేమని జస్టిస్ ఘరత్ వెల్లడించడం చర్చనీయాంశమైంది.
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు గత ఏడాది వివాహమైంది. అయితే, ఆ మహిళను ఆమె భర్త, అత్తింటివారు వరకట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో, ఆమె భర్తతోపాటు అత్తింటివారిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. దీంతోపాటు, పెళ్లైన నెల రోజుల తర్వాత తనకు ఇష్టం లేదని చెబుతున్నా భర్త తనతో బలవంతంగా సెక్స్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, అలా బలవంతంగా తనతో సెక్స్ చేయడం వల్ల తన నడుము కింది భాగం పక్షవాతానికి గురైందని కంప్లయింట్ ఇచ్చింది.
ఇదే విషయాన్ని డాక్టర్ కూడా నిర్ధారించారని, బలవంతపు శృంగారం వల్లే తనకీ దుస్థితి వచ్చిందని ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా దంపతుల మధ్య బలవంతపు శృంగారం చట్టం ముందు నిలబడని కోర్టు తీర్పునివ్వడం చర్చనీయాంశమైంది. అయితే, ఆమె పక్షవాతానికి గురికావడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించిన జడ్జి ఘరక్...ఆమె భర్తకు బెయిల్ మంజూరు చేయడం కొసమెరుపు. దీంతో, ఈ తీర్పు పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.