Begin typing your search above and press return to search.

ముంబ‌యి వాసులు మ‌హా ప‌నోళ్ల‌ట బాసూ!

By:  Tupaki Desk   |   5 Jun 2018 6:14 AM GMT
ముంబ‌యి వాసులు మ‌హా ప‌నోళ్ల‌ట బాసూ!
X
ముంబ‌యిలో అంతే.. ముంబ‌యిలో అంతే అంటూ స‌ర‌దాగా అనేస్తుంటాం కానీ.. ఆ మ‌హాన‌గ‌రానికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం వెలుగు చూసింది. జేబులో ప‌ది రూపాయిలు మొద‌లుకొని కోటి రూపాయిలు ఉన్నోడికి సైతం ఆశ్రయాన్ని ఇచ్చే ముంబ‌యి మ‌హాన‌గ‌రానికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని బ‌య‌ట‌పెట్టిందో అధ్య‌య‌నం. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా క‌ష్ట‌ప‌డే త‌త్త్వం ముంబ‌యి వాసుల‌కు ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించారు.

నిద్ర‌పోని న‌గ‌రంగా పేరున్న ముంబ‌యిలో విశ్రాంతి అన్న‌ది తీసుకోకుండా ప‌ని చేసే తీరు ఎక్కువ‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక్క‌డి ఉద్యోగులు చాలా ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతుంటార‌ని.. దీని కార‌ణంతోనే అత్య‌ధికంగా క‌ష్ట‌ప‌డే ఉద్యోగులు ఉన్న న‌గ‌రంగా గుర్తింపును తెచ్చుకుంది.

దాదాపు రెండు కోట్ల‌కు పైగా ప్ర‌జ‌లు ఉన్న ఈ అద్భుత న‌గ‌రం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కీల‌క‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ముంబ‌యి ఉద్యోగులు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక గంట‌లు ప‌ని చేస్తున్న రికార్డును సొంతం చేసుకున్నారు. ప్ర‌పంచంలోని 77 ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌ని చేస్తున్న వారితో పోల్చి చూసిన‌ప్పుడు.. ఏడాదికి 3314.7 గంట‌లు ప‌ని చేస్తూ మొద‌టి స్థానంలో నిలిచారు. ఇది ప్ర‌పంచ స‌గ‌టుతో పోలిస్తే.. 1987 గంట‌లు ఎక్కువ కావ‌టం చూస్తే.. ముంబ‌యి వాసుల క‌ష్టం ఎంత ఎక్కువ‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కీ ఈ అధ్య‌య‌నం ఎవ‌రు చేశారంటే స్విస్ బ్యాంక్ యూబీఎస్ చేసింది.

దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా.. ముంబ‌యి ప్ర‌జ‌ల‌కు క‌లుగుతున్న ఆర్థిక ప్ర‌యోజ‌నం చూస్తే చాలా త‌క్కువ‌.దీనికి సంబంధించి ఆస‌క్తిక‌ర లెక్క ఒకటి తాజా స‌ర్వే వెల్ల‌డించింది. ఖ‌రీదైన మొబైళ్ల‌లో ఒక‌టిగా చెప్పే ఐఫోన్ (టెన్) ను జూరిచ్ వాసి సొంతం చేసుకోవాలంటే కేవ‌లం 38.2 గంట‌లు ప‌ని చేస్తే స‌రిపోతుంద‌ట‌. అదే స‌మ‌యంలో జెనీవా వాసి అయితే 47.5 గంట‌లు ప‌ని చేయాల‌ట‌. లాస్ ఏంజెల్స్ నివాసి సైతం 50.6 గంట‌లు ప‌ని చేస్తే స‌రి. కానీ.. ముంబ‌యి వాసి సొంతం చేసుకోవాలంటే ఏకంగా 917.8 గంట‌లు.. ఢిల్లీ వాసి అయితే 804 గంట‌లు ప‌ని చేస్తే కానీ సొంతం కాద‌ట‌. దీన్ని బ‌ట్టి.. మ‌నోళ్ల శ్ర‌మ‌కు ద‌క్కుతున్న విలువ ఎంతో ఈ లెక్క చెప్పేస్తుంద‌ని చెప్పాలి.