Begin typing your search above and press return to search.

వీడి స్పెష‌ల్ మండిపోనూ.. శ్మ‌శానంలో బ‌ర్త్‌డే పార్టీ.. అది కూడా!

By:  Tupaki Desk   |   25 Nov 2022 4:30 AM GMT
వీడి స్పెష‌ల్ మండిపోనూ.. శ్మ‌శానంలో బ‌ర్త్‌డే పార్టీ.. అది కూడా!
X
తెలుగు క్యారెక్ట‌ర్ న‌టుడు రావు ర‌మేష్‌.. నోటి నుంచి జాలువారిన ఓ డైలాగు.. పెద్ద ఫేమ‌స్‌.. ''ఆడ్నెవ‌రికైనా చూపించ‌డ్రా బాబూ.. ఆడ్న‌లా వ‌దిలేయ‌కండ్రా!'' అచ్చం.. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు ఓ ఘ‌ట‌న‌కు సంబంధించి నెటిజ‌న్లు కూడా ఇవే కామెంట్లు చేస్తున్నారు. ''ఆణ్నెవ‌రికైనా చూపించండ్రా బాబూ'' అని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇంత‌కీ అత‌నెవ‌రు?  ఏం చేశాడు? అంటే..

మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన జన్మదిన వేడుకలను వినూత్నంగా అంటే స్పెష‌ల్‌గా నిర్వహించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా శ్మశానంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. అది కూడా ఖ‌చ్చితంగా అర్ధ‌ రాత్రి సమయంలో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు, చిన్నపిల్లలు కూడా విచ్చేశారు.
 
మహారాష్ట్ర ఠాణె జిల్లాకు చెందిన గౌతమ్ రత్నా మోర్ అనే వ్యక్తి భిన్నంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. నవంబరు 19న తన 54వ పుట్టినరోజు వేడుకలను స్థానిక శ్మశానంలో నిర్వహించాడు. శనివారం రాత్రి సమయంలో నిర్వహించిన ఈ వేడుకకు 40మంది మహిళలు, చిన్నపిల్లలతో సహా 100మంది విచ్చేశారు.

అక్కడే కేక్ కోసి పుట్టినరోజు జరుపుకున్నాడు గౌతమ్. వేడుకలకు వచ్చిన అతిథులకు శ్మశానంలోనే బిర్యానీ, కేక్ వడ్డించారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. శ‌శాల‌ను కాల్చే.. చితి ఐర‌న్ కేజ్‌పై కూర్చుని మ‌రీ.. త‌న పుట్టిన రోజు వేడుక‌ను నిర్వ‌హించుకోవ‌డం!

అయితే, సమాజంలో ఉన్న అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను రూపుమాపేందుకే ఇలా వినూత్నంగా ఆలోచించానని చెప్పాడు గౌతమ్. ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్, ప్రముఖ హేతువాది దివంగత నరేంద్ర దభోల్కర్లు.. అంధవిశ్వాసాలు, చేతబడి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారాలతో ప్రేరణపొంది ఈ వేడుకలను స్మశానంలో నిర్వహించానని చెప్పారు.

దెయ్యాలు, భూతాలు వంటి వాటి ఉనికి లేదని ప్రజలకు తెలియజేయాలని ఇలా చేశానని మోర్ తెలిపారు. అయితే, నెటిజ‌న్లు  మాత్రం దుమ్ముదులిపేస్తున్నారు. బ‌ర్త్‌డేను ఎంత వినూత్నంగా చేసుకోవాల‌ని అనుకున్నా.. ఇలానా చేసేది? అంటూ.. ఆణ్ని ఎవ‌రికైనా చూపించాల‌ని కామెంట్లు చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.