Begin typing your search above and press return to search.
'ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్' ఈజ్ బ్యాక్!
By: Tupaki Desk | 17 Aug 2017 3:52 PM GMT100 ఎన్ కౌంటర్స్....113 మంది గ్యాంగ్ స్టర్స్...ఇన్ ది స్పామ్ ఆఫ్ 25 ఈయర్స్ ...దిస్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్....ఇది దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ లా ఉందనుకుంటున్నారా? కానీ, ఇదంతా మహారాష్ట్రకు చెందిన ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఒరిజినల్ ట్రాక్ రికార్డు. ఆ పోలీసు అధికారి జీవిత కథను ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఏకంగా ఓ బాలీవుడ్ సినిమా కూడా తీశారు. ఛోటా రాజన్ వంటి గ్యాంగ్ స్టర్లకు ముచ్చెమటలు పట్టించిన ఆ ఆఫీసర్ మళ్లీ ట్రాక్ పైకి రాబోతున్నారు. మహారాష్ట్రకు చెందిన పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ (55)త్వరలోనే విధుల్లో చేరి నేరస్తుల గుండెల్లో గుబులుపుట్టించబోతున్నారు.
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో ప్రదీశ్ శర్మ జన్మించారు.1983 మహారాష్ట్ర పోలీస్ సర్వీస్ కు ఎంపికయ్యారు. సర్వీస్ లో చేరిన కొద్ది రోజులకే ముంబై మాఫియాకు వణుకు పుట్టించారు. ఏకే-56 ఆయుధాల స్పెషలిస్ట్ సుభాష్ మకద్వాలా ఎన్ కౌంటర్ తో ప్రదీప్ తన వేట ప్రారంభించారు. ఈ తర్వాత ముంబై మాఫియాలోని గ్యాంగ్ స్టర్ల కు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అదే దూకుడతో లష్కర్-ఈ-తోయిబా సానుభూతిపరులను కూడా ఏరిపారేశారు. అనతి కాలంలోనే ప్రదీప్ శర్మ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత ప్రదీప్ శర్మ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ - దావూద్ ఇబ్రహీం అనుచరులను టార్గెట్ చేశారు. డీ గ్యాంగ్ లోని గ్యాంగ్ స్టర్ లను ఒక్కొక్కరిగా ఏరిపారేయడం మొదలు పెట్టారు.
2000 సంవత్సరంలో తన ఇన్ ఫార్మర్ ఓపీ సింగ్ ను ఛోటా రాజన్ హత్య చేయటంతో ప్రదీప్ ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ హత్య తర్వాత రాజన్ కు ప్రదీప్ నిద్రలేకుండా చేశారు. ఛోటా రాజన్ అనుచరుల్ని ఒక్కొక్కరినీ ఎన్ కౌంటర్ చేస్తూ అతడికి చుక్కలు చూపించారు. ప్రదీప్ దూకుడుకు తట్టుకోలేక ఛోటా రాజన్ ఒకానొక సమయంలో కాళ్ల బేరానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రదీప్ శర్మ కథ ఆధారంగా నానా పటేకర్ హీరోగా అబ్ తక్ చప్పన్ అనే ఓ సినిమా కూడా వచ్చింది. అయితే, ప్రదీప్ శర్మ గ్యాంగ్ స్టర్లతో చేతులు కలిపాడన్న ఆరోపణలు రావడంతో కొన్నాళ్లపాటు సర్వీస్ కు దూరమయ్యారు. చివరకు ఆ ఆరోపణల నుంచి బయటపడటంతో ఇప్పుడు విధుల్లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ముంబైలోని గ్యాంగ్ స్టర్ లకు ఐ యామ్ బ్యాక్ అంటూ వార్నింగ్ బెల్ మోగించారు.