Begin typing your search above and press return to search.
72 గంటలు.. 750కి.మీ. ఛేజ్ చేసి ఉపముఖ్యమంత్రి వైఫ్ ను బెదిరించినోడు అరెస్టు
By: Tupaki Desk | 22 March 2023 7:00 AM GMTఅతడో అతి పెద్ద క్రికెట్ బుకీ. అలాంటోడు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న ముఖ్యనేత సతీమణిని బ్లాక్ మొయిల్ చేసే ఛాన్సు ఉంటుందా? అతడే కాదు.. అతడి కుమార్తె సైతం మార్ఫింగ్ ఫోటోల్ని చూపించి బ్లాక్ మొయిల్ చేసి రూ.10కోట్లు ఇవ్వాలన్న బెదిరింపులకు పాల్పడటమా?
ఇలాంటి ప్రశ్నలు వేస్తే.. ఛాన్సే లేదనేస్తారు. కానీ.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన తర్వాత.. ఇలా కూడా జరుగుతుందా? అన్న విస్మయం వ్యక్తమయ్యే పరిస్థితి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమ్రత ఫడ్నవీస్ ను బ్లాక్ మొయిల్ చేసిన క్రికెట్ బుకీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇందుకోసం 72 గంటల పాటు శ్రమించి.. దాదాపు 750 కిలోమీటర్లు ఛేజ్ చేసి మరీ అతడ్ని అదుపులోకి తీసుకోవటం గమనార్హం. దేశంలోనే అతి పెద్ద క్రికెట్ బుకీల్లో ఒకడైన అనిల్ జై సింఘానీని పోలీసులు అరెస్టు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఎందుకంటే.. అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. చెమటలు కార్చి మరీ అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అతడ్ని కోర్టు ఎదుట హాజరుపర్చారు. అతడ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు కళ్లు గప్పి రెండుసార్లు తప్పించుకోవటమే కాదు.. అత్యాధునిక ఎలక్ట్రికల్ పరికరాల సాయంతో పోలీసులకు మస్కా కొట్టినట్లుగా చెబుతున్నారు.
అనిల్ సిమ్ కార్డులు వినియోగించకపోవటం.. ఇంటర్నెట్ ఆధారిత వీవోఐపీ కాల్స్ మాత్రమే చేయటం.. వేర్వేరుపేర్లతో డాంగిల్స్ ను కొనుగోలు చేయటంతో అతన్ని గుర్తించటం కష్టమైందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి అనిల్ జై సింఘానీ ను కేసుల నుంచి బయటపడేయాలని అతడి కుమార్తె అనిక్ష .. మహా డిప్యూటీ సీఎం సతీమణి అమ్రతను కోరటం తెలిసిందే. అందుకు రూ.కోటి ముడుపులు ఇస్తానని చెప్పటం.. అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతో ఆమె మార్ఫింగ్ ఫోటోల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించిన వైనం సంచలనంగా మారింది.
ఇందుకోసం రివర్సులో రూ.10కోట్లకు బ్లాక్ మొయిల్ చేసినట్లుగా డిప్యూటీ సీఎం సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయాలన్ని బయటకు వచ్చాయి. ఇప్పటికే అనిక్షను పోలీసులు అరెస్టు చేయగా.. ఈ కేసులో కీలకమైన ఆమె తండ్రిని పెద్ద ఎత్తున ఛేజ్ చేసి అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.