Begin typing your search above and press return to search.
మానవత్వం మరిచిన పోలీస్..కారులో బిడ్డకు పాలిస్తుండగానే
By: Tupaki Desk | 12 Nov 2017 10:34 AM GMTనిబంధనల పేరుతో తీవ్ర వివాదాస్పదంగా ప్రవర్తించిన ముంబై పోలీస్ ఉదంతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్వస్థతకు గురైన ఓ మహిళ కారు వెనుక సీటులో కూర్చొని తన ఏడు నెలల పసికందుకు పాలు ఇస్తుండగా ముంబైలోని ఓ ట్రాఫిక్ పోలీసు అతి క్రూరంగా ప్రవర్తించాడు. నిబంధనలకు విరుద్ధంగా కారును నిలిపారంటూ ఆ కారుకు ఇనుప గొలుసు తగిలించి ట్రాఫిక్ వాహనంతో లాక్కెళ్లాడు. తనకు జ్వరం వచ్చిందని ఆ మహిళ చెప్పినా, డాక్టర్ సర్టిఫికెట్లు చూపినా ఆ పోలీసు కనికరించలేదు. కారు డ్రైవర్ అభ్యర్థించినా వినలేదు. అలాగే ముందుకుసాగాడు.
కారులో మహిళ - పసికందు అలాగే ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ మహిళ ఏడుస్తూ పసికందుకు పాలిస్తూ అలాగే కూర్చున్నారు. రోడ్డు పక్కన వెళ్లేవాళ్లు ఆమె బాధను చూసి వాహనాన్ని ఆపాలంటూ ట్రాఫిక్ పోలీసుకు సూచించినా అతడు పట్టించుకోలేదు. శుక్రవారం ముంబైలోని మలాద్ లో జరిగిన ఈ దారుణ సంఘటనను ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసు జాయింట్ కమిషనర్(ట్రాఫిక్) అత్యవసర విచారణకు ఆదేశించారు. బాధ్యుడైన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. కాగా, ఆ మహిళను కారు దిగాలని కోరినప్పటికీ...ఆమె తిరస్కరించిందని పోలీసులు పేర్కొన్నారు.