Begin typing your search above and press return to search.

ముకేశ్ అంబానీకి రూ.15కోట్లు.. రిలయన్స్ కు రూ.25కోట్లు ఫైన్

By:  Tupaki Desk   |   2 Jan 2021 4:00 AM GMT
ముకేశ్ అంబానీకి రూ.15కోట్లు.. రిలయన్స్ కు రూ.25కోట్లు ఫైన్
X
కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినంతనే దేశీయ కుబేరుడు.. ప్రపంచంలోని టాప్ సంపన్నుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తాజాగా ఆయనకు రూ.15కోట్లు.. ఆయనకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీపై మరో రూ.15కోట్ల మొత్తాన్ని జరిమానా వేశారు. ఇంత భారీగా ఫైన్ వేయటానికి వెనుకున్న కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ఇంతకీ ముకేశ్ అంబానీకి ఫైన్ వేసింది ఎవరంటే సెబీ. 2007 నవంబరులో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణతో పాటు.. కేసు కట్టారు. దీనిపై విచారణ జరిపిన సెబీ చివరకు ముకేశ్.. రిలయన్స్ తప్పు చేసినట్లుగా తేల్చారు. ఇంతకీ వారు చేసిన తప్పేమిటన్నది చూస్తే.. ఆర్ పీఎల్ లో 4.1 శాతం వాటాను విక్రయిచాలని.. 2007 మార్చిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది.

అదే ఏడాది నవంబరులో ఆర్ పీఎల్ షేర్లు ట్రేడింగ్ కు వచ్చాయి. ఈ సందర్భంగా నగదు.. ఫ్యూచర్ సెగ్మెంట్ లో అవకతవకలు జరిగినట్లుగా ప్రచారం జరిగింది. ఆర్ పీఎల్ లో తన వాటా షేర్ల విక్రమానికి సంబంధించిన లావాదేవీల ట్రేడింగ్ లో రిలయన్స్ ఇండస్ట్రీ తప్పులకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీంతో.. రిలయన్స కు రూ.25కోట్లు.. ముకేశ్ అంబానీకి రూ.15కోట్ల జరిమానాను విధించారు. రిలయన్స్ తో పాటు మరికొన్ని కంపెనీలకు ఫైన్ విధించారు. నవీ ముంబయి సెజ్ ప్రైవేటు లిమిటెడ్ కు రూ.20 కోట్లు.. ముంబయి సెజ్ లిమిటెడ్ కు రూ.10 కోట్ల మేర ఫైన్ విధిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. అయితే.. తమకు విధించిన జరిమానాలపై రిలయన్స్ వివరణ ఇవ్వకపోవటం గమనార్హం.