Begin typing your search above and press return to search.
నిమ్మగడ్డకు ముద్రగడ లేఖ.. ఆ ఆదృశ్యశక్తి ఎవరు?
By: Tupaki Desk | 25 Jan 2021 8:50 AM GMTఏపీలో పంచాయితీ ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్, వద్దని ఏపీ ప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. తాజాగా ఇదే అంశంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరును తప్పుపడుతూ ఓ సంచలన లేఖ రాశారు.
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ ముద్రగడ రాసిన లేఖ వైరల్ అయ్యింది. ఎస్ఈసాకి హితవు పలుకుతూ ఓ ఉత్తరాన్ని రాశారు. ఓ వైపు కరోనా విజృంభణ.. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండగా పంచాయితీ ఎన్నికలు నిర్వహణ ఏంటి అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వైఖరిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ముద్రగడ లేఖలో ఎస్ఈసీ నిమ్మగడ్డకు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి ఒక్క భారత దేశంలోనే తొలిసారిగా చూస్తున్నామని విమర్శించారు. మీకు వీలైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండని.. వీలైతే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండని లెటర్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం నిమ్మగడ్డ రమేశ్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే ఆయన వెనక అదృశ్యశక్తి నడిపిస్తుందని అనుమానం కలుగుతోందని ముద్రగడ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ముద్రగడ చేస్తున్న దాడిని చూస్తుంటే అలానే అనిపిస్తోందన్నారు. ఏపీలోని పరిస్థితిని అర్థం చేసుకోకుండా రాజకీయ నాయకుల్లా పట్టుదలకు పోయి పంచాయితీ ఎన్నికలను నిర్వహించి తీరుతాం అంటూ పట్టుదలకు పోరాదని హితవు పలికారు. ఇప్పటికైనా ఎన్నికలంటూ రచ్చ చేయడం మానేసి ఎస్ఈసీ ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు పోవాలని విజ్ఞప్తి ముద్రగడ చేశారు.