Begin typing your search above and press return to search.
పవన్ కోసం వెయిటింగ్ అంటున్న ముద్రగడ!
By: Tupaki Desk | 24 Jun 2023 2:36 PM GMTముద్రగడ పద్మనాభం అంటే నిజాయతీపరుడు, మంచి వాడు, నిబ్ద్ధత గలిగిన వాడు ఇలా చాలా ట్యాగ్స్ పక్కన కనిపిస్తాయి. వాటితో పాటు మరో ట్యాగ్ కూడా ఉంది. ఆయన మొండివారు. పట్టుదల మనిషి ఆయనను కెలికిన వారు ఎవరైనా సరే ముద్రగడ వైపు నుంచి భారీ రియాక్షనే వస్తుంది. అది మూడు దశాబ్దాల క్రితం నాటి సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి అయినా 2014 కాలంలో సీఎం గా ఉన్న చంద్రబాబు అయినా ఒక్కటే.
ముద్రగడది రాజీలేని మనస్తత్వం. నాకు ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చారు. నా పని నేను చేసుకుంటాను, మధ్యలో మీ జోక్యం ఏంటి అంటూ అన్నఎన్టీయార్ నే ఆయన ప్రశ్నించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన ధీశాలి ముద్రగడ.
ముద్రగడకు పదవుల వ్యామోహం లేదు, రాజకీయాలు అవసరమూ లేదు. ఆయన కమిటెడ్ గా ఉంటారని పేరు. కాపుల కోసం ఆయన ఎందాకైనా వెళ్తారు అన్నది చరిత్ర చెబుతుంది. అంతే కాదు అత్మాభిమానం ఎక్కువ ఆయనకు. అలాంటి ముద్రగడను ఏమీ కాకుండా లైట్ తీసుకున్నా డైరెక్ట్ గానూ ఇండైరెక్ట్ గానూ విమర్శలు చేసినా కూడా తప్పే ముప్పే.
ఇపుడు ఆ పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. ఆయన కాకినాడ సభలో ముద్రగడ పేరు ఎత్తకపోయినా కాపులలో భావోద్వేగాలు రగిలించి కొందరు నాయకులు చాలా చేశారు అంటూ ముద్రగడ మీద పేల్చిన ఇండైరెక్ట్ కామెంట్స్ తోనే ఆయనకు కోపం కస్సున లేచింది. అందుకే వరసగా రెండు లేఖలు రాశారు.
దాని మీద జన సేన అధికార ప్రతినిధి కాకపోయినా మాజీ మంత్రి హరి రామజోగయ్య నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో ముద్రగడ మాట్లాడుతూ తాను ఎవరో జనసేన నుంచి మాట్లాడితే రియాక్ట్ కాను అని చెప్పారు. తాను రెండు లేఖలు పవన్ కే డైరెక్ట్ గా రాశానని, ఆయన స్పందిస్తేనే మాట్లాడుతాను అని చెప్పారు.
పైగా తాను ఎక్కడికీ పారిపోనని, ఇక్కడే ఉంటాను అని కూడా చెప్పారు. తాను రాసిన రెండు లేఖలకూ పవనే స్పందించాలని ఆయన కోరారు. పవన్ మాట్లాడితే అపుడు తాను కూడా దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతాను అని చెప్పారు. తాను ఇక్కడే ఉంటాను అని ముద్రగడ చెప్పడమూ ఒక సవాల్ లాంటిదే.
అంతే కాదు పవన్ కోసం వెయింటింగ్ అన్నట్లుగానే ఆయన సౌండ్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ముద్రగడ లేఖలకు నేరుగా సమధానం చెబుతారా. ఆయనతో ఢీ కొడతారా. ఆయన కోరినట్లుగా పిఠాపురం నుంచి పోటీకి సై అంటారా ఏమో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ముద్రగడ మీద పవన్ సైన్యం విమర్శల జల్లు కురిపిస్తోంది.
మామూలుగా చూస్తే విమర్శలు చేసిన తరువాత అవతల వారు చేసే ప్రతి విమర్శలకు సమాధానలు చెప్పడం అన్నది పవన్ పాలిటిక్స్ లో పెద్దగా కనిపించదు. ఇది కూడా అంతే అవుతుంది అనుకోవాలి. కానీ ముద్రగడ తనను తట్టి లేపారని అంటున్నారు. తాను వెయిటింగ్ అంటున్నారు. మరి పవన్ వారాహి యాత్ర ముగిసే లోపు ముద్రగడకు జవాబు చెప్పకపోతే ఏమవుతుంది అంటే వేచి చూడాల్సిందే.