Begin typing your search above and press return to search.
నన్ను తీహార్ జైలుకు పంపాలనుకున్నారు... ముద్రగడ అటాక్ ఎవరి మీద...?
By: Tupaki Desk | 10 May 2023 2:08 PM GMTఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించడానికి కాపు నాయకుడు, సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రాబోతున్నారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను ఇపుడు నిర్దోషిని అని అంటున్నారు. త్వరలోనే ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో తనను తుని రైలు దహనం కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ కేసుకు సంబంధించి ఏపీలో కూడా తనను ఉండనీయకూడదు అనుకున్నారని, ఏకంగా తీహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. అంతే కాదు ఇదే కేసులో బెయిల్ తెచ్చుకోమని వత్తిడి చేశారని అన్నారు. తనను అండర్ గ్రౌండ్ కి కూడా వెళ్లమని సలహాలు ఇచ్చారని ఆయన ఫ్లాష్ బ్యాక్ విషయాలు చెప్పారు.
తాను కనుక అలా చేసి ఉంటే తన కులంతో పాటు తాను ఉద్యమం కూడా చులక పలుచన అయ్యేవారని ఆయన అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే ఎవరి వత్తిడులకు లొంగలేదని, అలా నిటారుగా నిలబడ్డానని, దాని ఫలితమే ఇపుడు తాను నిర్దోషిగా బయటకు వచ్చాను అని ఆయన అన్నారు.
మరి ముద్రగడను తీహార్ జైలుకు తరలించడానికి చూసింది ఎవరన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఒక విధంగా చంద్రబాబు తో ఢీ అంటే ఢీ కొట్టారు. కాపుల ప్రయోజనాలే తప్ప మరేమీ వద్దని కూడా ముద్రగడ పట్టుబట్టారు. భీష్మించుకుని కూర్చున్నారు. ఆయన ఎక్కడా రాజీ పడలేదు.
అందుకే ఆయన క్రెడిబిలిటీ అలా ఉందని కాపు నాయకులే చెబుతారు ఇక ముద్రగడను అండర్ గ్రౌండ్ కి వెళ్లమని వత్తిడి చేసిన వారు ఎవరో అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా ముద్రగడ చేసిన కామెంట్స్ అన్నీ కూడా తుని ఘటన అరెస్టులు తన మీద కేసుల నేపధ్యంలో చేసినవే కాబట్టి ఆయన టీడీపీ అధినాయకత్వం మీదనే తన బాణాలను ఎక్కుపెట్టారని అంటున్నారు.
తుని రైలు దహనం ఘటనకు సంబంధించి విజయవాడలోని కోర్టు ఇటీవలనే ముద్రగడ తదితరులను నిర్దోషులుగా తేల్చింది. దాంతో ఆయనను మళ్లీ రాకీయాల్లోకి రమ్మంటూ కాపు నేతలతో సహా అన్ని వర్గాల వారూ కోరుతున్నారు. ముద్రగడ సైతం ఈ విషయం మీద ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు ఆయన ఇచ్చిన ప్రకటనతో ఆయన కచ్చితంగా రాజకీయల్లోకి వస్తారు అని అంటున్నారు.
అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న దాని మీదన కనుక ఆలోచిస్తే ఆయన తన అరెస్ట్ మీద ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు అంటే టీడీపీ నాడు ఆయన్ని అవమాన పరచిన తీరుని మరచిపోలేదు అని అంటున్నారు. దాంతో ఆయన టీడీపీలో చేరేది ఉండదని అంటున్నారు. అయితే వైసీపీ లేకపోతే బీజేపీ అనే అంటున్నారు. మరి ఈ రెండింటిలో ఏది చేరాలనుకున్నా బాబు నీడ పడకూడదు అన్నదే ముద్రగడ ఆలోచన. బీజేపీ తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోకపోతే మాత్రం కమలం వైపు చూస్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలా జరగకపోతే ఆయన జగన్ కే మద్దతు ఇస్తారని తెలుస్తోంది.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బాహాటంగా మద్దతు ఇచ్చి పొత్తులకు సిద్ధమని సంకేతాలు పంపుతున్న నేపధ్యంలో బలమైన కాపు నేతగా కాపుల్లో అరాధ్యనీయుడిగా ఉన్న ముద్రగడను వైసీపీ చేర్చుకోవడానికే సిద్ధపడుతుంది అని అంటున్నారు. మొత్తానికి ముద్రగడ తాజా ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాలలో ప్రకంపలను రేగుతున్నాయని చెప్పాల్సి ఉంది.