Begin typing your search above and press return to search.

అమ్మకం కాదు.. నమ్మకం పెంచాలి: ముద్రగడ పద్మనాభం

By:  Tupaki Desk   |   9 Feb 2021 10:33 AM GMT
అమ్మకం కాదు.. నమ్మకం పెంచాలి: ముద్రగడ పద్మనాభం
X
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమ స్పందన తెలియజేశారు. ఈ మద్య మీడియాలో రైతులు, రైల్వేలు, విమానాయాన సంస్థలు, ఎంతోమంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వగైరాలు ప్రైవేటు పరం చేస్తున్నట్లు చూస్తున్నాను. పెద్ద విషయాలు వ్రాయదగ్గ తెలివితేటలు ఉన్న వ్యక్తిని కాను, సముద్రంలో చిన్న ఇసుక రేణువులాంటి వాడిని వ్రాస్తున్నాను, వ్రాయకతప్పడం లేదండి. ఈస్టిండియా కంపెనీ పేరుతో భారతదేశంలోకి వ్యాపారం నిమిత్తం వచ్చి, ఇక్కడ తిష్ఠవేసి, ఎన్నో సంవత్సరాలు బ్రిటీష్ వారు పాలన చేసారు. ఈరోజు ముఖ్యమైన వ్యవస్థలు అన్నియు విదేశీయులు లేక దేశంలో ఉన్న బడా సంస్థలు చేతులలో పెట్టే ప్రయత్నం చాలా బాధాకరం. అమ్మకం కాదు ప్రజల్లో నమ్మకం పెంచాలని అన్నారు.

ఆ సంస్థలు రేపన్న రోజు దేశంలో బలపడిన తరువాత గౌరవ ప్రధానమంత్రి పదవి నుండి రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు పదవులు వరకు ప్రైవేటు పరం చేయమని ఒత్తిడి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదండి. అటువంటి పరిస్థితికి తమరు ఎందుకు అవకాశం ఇవ్వాలి, మీ హోదాకు తగిన నిర్ణయాలు కాదండి. మీ మీద ఆధారపడ్డ అపరకోటీశ్వర్లు కొరకు అని అందరూ అనుకుంటున్నారండి. మీడియా చర్చలలో గతంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలా వ్వవస్థలను ప్రైవేట్ పరం చేసారు కదా, ఇప్పుడు తప్పేంటి అంటున్నారు. ఇలాంటివి చేసారు కాబట్టే ప్రజలు వారిని ఇళ్ళకు పరిమితం చేసారండి ఒక ప్రక్క ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోను, పోలవరం ప్రాజక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ,మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఆ ఆశలు ఆవిరి అవుతున్న సందర్భములో విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం,అనేటప్పటికి పుండు మీద కారం చల్లిన చందంగా తయారు అయ్యింది. విశాఖ ఉక్కు ..ఆంధ్రుల హక్కు అని గుర్తించాలని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి తాను రాసిన లేఖను సోమవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఆయన మీడియాకు విడుదల చేశారు. కరోనా వచ్చిన తరువాత ఎన్నో వ్యాపార సంస్థలు నష్టాలతో నడుస్తున్నాయి ఇంకా వారి సంస్థలు పట్టాలెక్కలేదు, వారి గురించి ఆలోచించండి ప్రజల కష్టాలలో పాలుపంచుకుంటారని, వారి జీవితాలలో వెలుతురు నింపుతారని ఆశతో పాలన చేయమని ఓట్లు వేసి అందలం ఎక్కించడం మీకు తెలియనిది కాదు. కాని వారి కోరికలు తగ్గట్టుగా పాలకులు నడుచుకోవడం మంచిదని అయన అన్నారు.