Begin typing your search above and press return to search.
కోహ్లీ మళ్లీ టీమిండియా కెప్టెన్ ..? చెప్పింది తెలుగు సెలక్టరే ..?
By: Tupaki Desk | 11 July 2023 5:00 PM GMTసరిగ్గా ఏడాదిన్నర అవుతోంది. విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ వదిలేసి. అప్పట్లో బీసీసీఐ చైర్మన్ గా ఉన్న సౌరభ్ గంగూలీతో టి20 కెప్టెన్సీ గురించి మాట పట్టింపు వచ్చి తొలుత వన్డే తర్వాత టెస్టు కెప్టెన్సీని కూడా వద్దనుకున్నాడు కోహ్లి. ఈ మధ్యలో చాలా మార్పులు జరిగాయి. రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకూ కెప్టెన్ అయ్యాడు. కానీ, అంతలోనే టి20 ఫార్మాట్ కు అతడిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కోహ్లిది ఇదే పరిస్థితి. వీరిద్దరినీ కుర్రాళ్ల ఫార్మాట్ అయిన టి20లకు దాదాపు పక్కనపెట్టినట్లే. దిగ్గజ క్రికెటర్లు కాబట్టి వేటు లేదా తొలగింపు అనే పదాలు వాడడం లేదు. ఇంతమాత్రం దానికే విరాట్ అనవసరంగా బోర్డుతో గొడవపడడం ఎందుకంటారా? కానీ, అదంతా చరిత్ర. అయితే, ఇప్పుడు మరో పెద్ద చర్చ నడుస్తోంది.
రోహిత్ ప్చ్..
టీమిండియా మేటి బ్యాట్స్ మన్ లలో రోహిత్ శర్మ ఒకడు. అందులో సందేహం లేదు. టి20లు, వన్డేల్లో అతడి తిరుగులేని రికార్డులే ఇందుకు సాక్ష్యం. అయితే, టెస్టులకు వచ్చేసరికి రోహిత్ సత్తా ఎప్పుడూ ప్రశ్నార్థకమే. అరంగేంట్రంలోనే రెండు సెంచరీలు చేసినా రోహిత్ కు సుదీర్ఘ ఫార్మాట్ లో స్థానం శాశ్వతం కాలేదు. కానీ, నాలుగేళ్లుగా అతడు టెస్టులకు తగినట్లు ఆటను మార్చుకున్నాడు. మూడేళ్ల కిందట జట్టు సభ్యుడే కాని రోహిత్ ఇప్పుడు ఏకంగా కెప్టెన్. మరోవైపు రోహిత్ నుంచి టెస్టుల్లో ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు.
జట్టు ఎంపిక, ఆటగాళ్ల గాయాలతో అతడి వనరులు పరిమితం అయిపోయాయి. సునీల్ గావస్కర్ లాంటి మేటి ఆటగాడు కూడా రోహిత్ కెప్టెన్సీని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే టెస్టు చాంపియన్ షిప్ నాటికి రోహిత్ జట్టు సభ్యుడిగా ఉండడని, వన్డే ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ కు వీడ్కోలో పలుకుతాడని అంటున్నారు. టెస్టు కెప్టెన్ గా విండీస్ సిరీస్ చివరి అవకాశంగానూ చెబుతున్నారు. ఇదంతా కాకున్నా మరో రెండేళ్లు రోహిత్ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే ఫిట్ నెస్ లో లేడని విశ్లేషకుల మాట.
మారుస్తారా..?
గంగూలీకి ముందు టీమిండియా కెప్టెన్లు తరచూ మారేవారు. అనిశ్చిత పరిస్థితిలో సౌరభ్ జట్టును నిలబెట్టాడు. ఆ తర్వాత ధోని, కోహ్లి కొనసాగించారు. ఇప్పుడు రోహిత్ వైఫల్యంతో టెస్టు జట్టు సారథ్య బాధ్యతలపై మళ్లీ చర్చ ఊపందుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో వ్యక్తిగతంగానూ, జట్టును నడిపించడంలో విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి. మరొకరిని కెప్టెన్ గా నియమించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
అతడికే ఇవ్వాలి..
రోహిత్ కు ఇప్పుడు 35 ఏళ్లు పైబడ్డాయి. కోహ్లి 34వ పడిలో ఉన్నాడు. వీరిద్దరూ రెండు, మూడేళ్లే సేవలందించగలరు. రోహిత్ కెప్టెన్ గా తప్పుకొంటే మళ్లీ విరాట్ కోహ్లీకే అవకాశం ఇవ్వాలని మాజీ చీఫ్ సెలక్టర్, తెలుగువారైన ఎమ్మెస్కే ప్రసాద్ సూచించారు. ఇందుకు అజింక్య రహానెను ఉదాహరణగా చూపించడం విశేషం.
''కోహ్లీకి ఎందుకు మళ్లీ చాన్స్ ఇవ్వకూడదు? వేటు అనంతరం వచ్చిన రహానె వైస్ కెప్టెన్ కాలేదా? కానీ కెప్టెన్సీపై కోహ్లీ స్పందన ఏమిటో తెలియాలి. రోహిత్ కాదంటేనే విరాట్ వైపు చూడాలి. పంత్ కూడా మంచి ఆప్షనే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లలో మరే ఇతర భారత వికెట్ కీపర్లు చేయని విధంగా అతడు పరుగులు సాధించాడు. అతడు ముందుగా జట్టులోకి రావాలి. కుదురుకోవాలి'' అని ప్రసాద్ తెలిపాడు. కాగా, వెస్టిండీస్ తో రేపటినుంచి మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్ లో రోహిత్ వ్యక్తిగతంగా కచ్చితంగా రాణించాలి. లేదంటే విమర్శలు అటుంచి టెస్టు కెప్టెన్సీ పనిలో పనిగా స్థానం కూడా గల్లంతవుతుంది.