Begin typing your search above and press return to search.

ఎవరో ఆ సుందరి...

By:  Tupaki Desk   |   27 Jun 2015 9:49 AM GMT
ఎవరో ఆ సుందరి...
X
కొత్త రాష్ట్రం తెలంగాణ అన్నిరంగాల్లో తన గొప్పదనాన్ని చాటుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది... ఉత్సాహంగా కదులుతోంది. ఫ్యాషన్ రంగంలోనూ తామేమీ తక్కువ తినలేదని ప్రపంచానికి చాటేక్రమంలో ఇక్కడ మిసెస్ తెలంగాణ-2015 పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నక్షత్ర మీడియా అనే సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో రెండు కేటగిరీల్లో వివాహితలెవరైనా పోటీ పడొచ్చు. మొదటి కేటగిరీలో అంతా 40 ఏళ్లలోపువారే అర్హులు.... రెండో కేటగిరీ అంతా 40 ఏళ్లకు పైబడినవారికోసం.

తెలంగాణలోని పది జిల్లాల మహిళలు పాల్గొనే ఈ పోటీల్లో ఫైనల్ కు 30 మందిని ఎంపిక చేస్తారు. ఆ 30 మంది నుంచి మిసెస్ తెలంగాణను ఎంపికచేస్తారు. తాజాగా జరిపిన ఈ కాంపిటీషన్ అనౌన్స్ మెంటు కార్యక్రమంలో నీలిమా నాయుడు, వేలంటీనా వంటి ప్రముఖ మోడళ్లు.... శ్రీముఖి, శ్యామలి తదితర నటీమణులు సందడి చేశారు.