Begin typing your search above and press return to search.

మంద కృష్ణ మాదిగ ఇప్పుడు మేల్కొన్నారే.. ఏపీలో దారుణాలు జ‌రుగుతున్నాయ‌ట‌!!

By:  Tupaki Desk   |   22 May 2023 8:00 AM GMT
మంద కృష్ణ మాదిగ ఇప్పుడు మేల్కొన్నారే.. ఏపీలో దారుణాలు జ‌రుగుతున్నాయ‌ట‌!!
X
ఏపీలో వైసీపీ అధినేత జ‌గ‌న్ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో అనేక మంది ఎస్సీల‌పై దాడులు జ‌రిగాయ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. విశాఖ‌లో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ డాక్ట‌ర్‌ను పోలీసులు నిర్బం ధించారు. కొట్టారు. చివ‌ర‌కు ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, ఎస్సీ నాయ‌కుల‌పైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇక‌, రాజ‌ధాని రైతుల‌పైనా ఎస్సీ కేసులు పెట్టారని వారు కూడా కోర్టుల‌కు వెళ్లారు.

మ‌రి ఇంత జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌ని మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి(ఎమ్మార్పీఎస్‌) అధినేత మంద కృష్ణ మాదిగ .. ఇప్పుడు మాత్రం త‌గుదునమ్మా అంటూ తెర‌మీదికి వ‌చ్చారు. ఏపీలో దళితుల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని మంద కృష్ణ మాదిగ అన్నారు.

ప్రశ్నించడమే ఏపీలో నేరంగా మారిందన్నారు. జడ్జీలను సైతం జైళ్లల్లో పెట్టే పరిస్థితి వచ్చిందని మండి పడ్డారు. ఏపీలో జరుగుతున్న దారుణాలు కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బాధితుల కేసుల్లో పోలీసు లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

డాక్టర్ అచ్చెన్న మరణంలో ఇదే జరిగిందన్నారు. అనుమానితుల పేర్లను బాధిత దళితులు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దళితులు హత్యకు గురవుతున్నా.. హత్య కేసు నమోదు కావడం లేదన్నారు. ఏపీలో దళితులు మాడి మసై పోతు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే.. ఇంత హ‌ఠాత్తుగా.. మంద కృష్ణ‌కు మాదిగ‌లు.. ఎస్సీలు గుర్తుకు రావ‌డం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి. ఇన్నాళ్లు ఆయ‌న ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ప‌ట్టించుకోలేదు.? మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన దాడులను ఆయ‌న ఏకోణంలో చూస్తున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఏదేమైనా.. ఎన్నిక‌లు ఉన్న రాష్ట్రాల‌కు వెళ్లి.. అక్క‌డ రాజ‌కీయాలు చేయ‌డం.. త‌ద్వారా ఏదైనా ల‌బ్ధి పొంద‌డం ఇటీవ‌ల కాలంలో కొంద‌రికి అల‌వాటుగా మారిందనే విమ‌ర్శ‌లు వున్నాయి. మ‌రి ఈ జాబితాలో ఇప్పుడు మంద కృష్ణ కూడా చేరుతున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న క‌ర్నాట‌క‌లో బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్ర‌చారం చేసిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం.