Begin typing your search above and press return to search.
బాబాయి మర్డర్.. నాలుగోసారి సీబీఐ విచారణకు అబ్బాయి!
By: Tupaki Desk | 14 March 2023 1:42 PM GMTదివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. ఇప్పటికే మూడుసార్లు ఆయనను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మార్చి 14న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో అవినాష్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలో అధికారులు అవినాష్‌ను విచారిస్తున్నారు.
వాస్తవానికి తనకు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున సీబీఐ ముందు హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని.. ఈ విషయాన్ని సీబీఐ వద్దే తేల్చుకోవాలని అవినాష్ కు సూచించింది. ఈ నేపథ్యంలో సీబీఐకి మార్చి 13న అవినాష్ రెడ్డి లేఖ రాశారు. తనకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని.. అందువల్ల తనను విచారణ నుంచి మినహాయించాలని కోరారు. అయితే దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఈ నేపథ్యంలో సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాసినా స్పందన లేకపోవడంతోనే విచారణకు ఆయన హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీబీఐ ఎస్పీ రాంసింగ్ కూడా తన సిబ్బందితో కలిసి ఉదయానే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాష్ రెడ్డి సైతం తన న్యాయవాదితో పాటు సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ గదిలోకి అవినాష్ రెడ్డిని మాత్రమే సీబీఐ అనుమతించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుతారా.. లేదా? తెలియనుంది. కాగా.. నేడు కూడా 160 సీఆర్‌పీసీ కింద విచారణ చేసి స్టేట్‌మెంట్ ను సీబీఐ రికార్డు చేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఆదేశాలిచ్చారు. తన తీర్పును రిజర్వు చేశారు.
వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయరాదని.. తనను విచారించకుండా అడ్డుకోవాలని.. తన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలని.. విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మార్చి 13న మరోసారి విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున స్పెషల్ పీపీలు నాగేంద్రన్, డాక్టర్ అనిల్ కుమార్ వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డికి సంబంధించిన వివరాలతో భారీ సీల్డ్ కవర్‌ను కోర్టుకు అందజేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.