Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ కూతురికి న‌డిరోడ్డుపై అవ‌మానం!

By:  Tupaki Desk   |   4 Feb 2017 6:36 AM GMT
టీడీపీ ఎంపీ కూతురికి న‌డిరోడ్డుపై అవ‌మానం!
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీలో ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపు త‌గాదాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. ఇత‌ర జిల్లాల ప‌రిస్థితి ఎలా ఉన్నా... సాక్షాత్తు పార్టీ అధినేత‌ - సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లాలోనూ ఈ త‌ర‌హా గ‌లాటాలు రోడ్డెక్కుతున్నాయి. తాజాగా వెలుగుచూసిన ఓ వివాదం ఆ పార్టీలో ప‌రిస్థితి ఎలా ఉందో క‌ళ్ల‌కు క‌ట్టేసింది. అది కూడా చంద్ర‌బాబు సొంతూరు నారావారిప‌ల్లెకు కూత‌వేటు దూరంలో చోటుచేసుకోవ‌డం ప‌రిస్థితి ఏ రేంజిలో ఉందో చెప్ప‌క‌నే చెప్పేసింది. వివ‌రాల్లోకెళితే... చిత్తూరు ఎంపీగా టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌ - ప్ర‌ముఖ సినీ న‌టుడు శివ‌ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుప‌తిలో శివ‌ప్ర‌సాద్ కుటుంబం నివాస‌ముంటోంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ ఉద్యోగినిగా ప‌నిచేస్తున్న ఆయ‌న కుమార్తె మాధ‌వీలత‌.. తిరుప‌తి-చంద్ర‌గిరి మ‌ధ్య‌లో కారులో వెళుతుండ‌గా, తిరుప‌తి స‌మీపంలో ఆమె కారుకు ఓ కారు అడ్డంగా వ‌చ్చేసింది. స‌ద‌రు కారు మ‌రెవ‌రిదో కాదు... టీడీపీకే చెందిన సీనియ‌ర్ నేత‌ - చంద్రబాబు కేబినెట్‌ లో మంత్రిగా ఉన్న ఓ ప్ర‌ముఖ నేత ముఖ్య అనుచ‌రుడు నాగేంద‌ర్ రెడ్డిదట‌.

రోడ్డుకు అడ్డంగా కారు పెడితే... తామెలా వెళ్లేదంటూ మాధ‌వీల‌త కారు డ్రైవ‌ర్ నాగేంద‌ర్ రెడ్డి కారు డ్రైవ‌ర్‌ ను నిల‌దీశార‌ట‌. అంతేకాకుండా కారు ప‌క్క‌కు తీస్తే... తాము వెళ‌తామంటూ అత‌డు చెప్పాడ‌ట‌. ఈ మాత్రానికే కారులో కూర్చున్న నాగంద‌ర్‌ రెడ్డి ఉన్న‌ప‌ళంగా కారు దిగేసి... త‌న డ్రైవ‌ర్‌ తో క‌లిసి మాధ‌వీల‌త డ్రైవ‌ర్‌ పై చేయి చేసుకున్నాడ‌ట‌. దీంతో కాస్తంత ఆగ్ర‌హానికి గురైన మాధ‌వీల‌త కారు దిగి వారిని నిలువ‌రించ‌బోగా... వారు ఆమెను కులం పేరుతో దూషించ‌డ‌మే కాకుండా... త‌మ‌నే ప‌క్క‌కు త‌ప్పుకోమంటారా? అంటూ ఎదురు దాడికి దిగార‌ట‌. కులం పేరుతో దూషించ‌డంతో ఒక్క‌సారిగా షాక్ తిన్న మాధ‌వీల‌త... తానెవ‌రినో తెలుసా అంటూ... త‌న తండ్రి పేరు చెప్పి... ఎంపీ కూతురినైన త‌న‌కే ఇలా జ‌రిగితే... ఇక సాధార‌ణ ద‌ళిత మ‌హిళ ప‌రిస్థితేంటంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా విన‌ని నాగేంద‌ర్ రెడ్డి మరింత‌గా రెచ్చిపోయి... మీరెవ‌రైతే త‌న‌కేంట‌ని, తాను మంత్రిగారి ముఖ్య అనుచ‌రుడినంటూ బెదిరింపుల‌కు దిగాడు. దీంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మార‌గా, అహం దెబ్బ‌తిన్న మాధ‌వీల‌త త‌న‌కు నాగేంద‌ర్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఈ క్ర‌మంలో అప్ప‌టికే స‌మాచారం అందుకున్న తిరుప‌తి పోలీసులు అక్క‌డికి ప‌రుగు ప‌రుగున వెళ్లి... నాగేంద‌ర్‌ రెడ్డి - ఆయ‌న కారు డ్రైవ‌ర్‌ ను అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. అయితే నాగేంద‌ర్ రెడ్డి త‌న‌ను అవ‌మానించిన చోటే త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. అంతేకాకుండా... క్ష‌మాప‌ణ చెప్పేదాకా అక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని, న‌డిరోడ్డుపైనే బైఠాయించారు. ఇలా దాదాపు నాలుగు గంట‌ల‌కు పైగా ఆమె రోడ్డుపై బైఠాయించినా పోలీసుల వైపు నుంచి ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌లేదు. స్టేష‌న్‌ కు వ‌స్తే... నాగేంద‌ర్‌ రెడ్డితో క్ష‌మాప‌ణ చెప్పిస్తామ‌న్న పోలీసుల వాద‌న‌ను మాధ‌వీల‌త తిప్పికొట్ట‌డ‌మే కాకుండా... విష‌యాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ‌తాన‌ని చెప్పి ఇంటికెళ్లిపోయి.. జ‌రిగిన విష‌యాన్ని త‌న తండ్రి శివ‌ప్ర‌సాద్‌ కు పూస‌గుచ్చిన‌ట్లు చెప్పారు. దీంతో షాక్ తిన్న శివ‌ప్ర‌సాద్‌... త‌న కూతురుకు అన్యాయం జ‌రిగింద‌ని, నాగేంద‌ర్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యం జిల్లాలో చిలికిచిలికి గాలివాన‌లా మారే ప‌రిస్థితి లేక‌పోలేదు. మ‌రి మాధ‌వీల‌త ఆవేద‌న చంద్ర‌బాబు చెవిన ప‌డిందో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/