Begin typing your search above and press return to search.

ఆప్ నేతతో బాలీవుడ్ నటి డేటింగ్.. కంగ్రాట్స్ చెప్పిన ఎంపీ

By:  Tupaki Desk   |   29 March 2023 10:48 AM GMT
ఆప్ నేతతో బాలీవుడ్ నటి డేటింగ్.. కంగ్రాట్స్ చెప్పిన ఎంపీ
X
రాజకీయాలకు.. సినిమాకు మధ్యనున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటిదే మరో జంట పెళ్లి దిశగా అడుగులు వేస్తుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ జంటకు తాజాగా ఎంపీ సంజీవ్ అరోరా చేసిన ట్వీట్ తో ఈ క్యూట్ జంట గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆప్ నేత రాఘవ్ చద్దాతో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా డేటింగ్ లో ఉన్నట్లుగా కొంతకాలంగా గుసగుసలు వినపడటం తెలిసిందే.ఈ మధ్యనే ఈ జంట ఒక రెస్టారెంట్ కు వెళ్లటం.. అక్కడ కెమేరాల కంట పడటం తెలిసిందే.

దీంతో.. ఈ జంట మీద డేటింగ్ రూమర్స్ ఎక్కువ అయ్యాయి. ఇలాంటివేళలో.. ఎంపీ సంజీవ్ ఆరోరా ఒక ట్వీట్ చేస్తూ.. వీరిద్దరి మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ ను అధికారికం చేశారని చెప్పాలి.

''మీ ఇద్దరి ప్రేమకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. వారి మధ్య ప్రేమ.. ఆనందం ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నా. ఈ జంటకు శుభాకాంక్షలు'' అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగామారింది.

ఎంపీ సంజీవ్ ట్వీట్ తో పలువురు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరికి సన్నిహితంగా ఉండే ఒకరు ఇచ్చిన క్లారిటీ ప్రకారం.. ఇరు కుటుంబాలు వీరిద్దరి పెళ్లిపై చర్చలు జరుపుతున్నారని.. ఇటీవల విందుకు కూడా వెళ్లినట్లుగా పేర్కొన్నారు.

వీరిద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమని.. త్వరలోనే వేడుక జరిగే వీలుందని.. ఇద్దరు కలిసి ఉండటంపై ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఒక యువ రాజకీయ నాయకుడు.. మరో ప్రముఖ బాలీవుడ్ నటి ఇద్దరు వివాహ బంధంతో ఏకమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.