Begin typing your search above and press return to search.
డ్యాన్స్ ఇరగదీసిన ఎంపీ ప్రగ్యా ఠాకూర్...వీడియో వైరల్ , నోటికి పని చెప్తున్న కాంగ్రెస్ !
By: Tupaki Desk | 10 July 2021 7:30 AM GMTఈ మధ్య కాలంలో దేశంలోనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న వారిలో బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఒకరు. తాజాగా ఆమెకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల కిందట బాస్కెట్ బాల్ ఆడుతున్న వీడియో వైరల్ అయ్యింది. తాజాగా, ఓ పెళ్లికి హాజరైన ఎంపీ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో బయటకు వచ్చింది. భోపాల్ లో ఇద్దరు పేద యువతుల పెళ్లిళ్లకు హాజరైన ప్రగ్యా ఠాకూర్.. అప్పగింతల సమయంలో డీజే పెట్టించారు. అతిథులతో పాటు తాను సైతం స్టెప్పులేశారు. ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఎప్పుడూ వీల్ ఛైర్ లోనే కన్పించే ఆమె, ఒక్కసారిగా బాస్కెట్ బాల్ ఆడటం, డ్యాన్సులు చేస్తుండటం చూసి కొందరు షాక్ కు గురవుతున్నారు.
ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ నేతలు కూడా తమ నోటికి పని చెప్తున్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఆరోపణలు ఎదురుకుంటున్నారు.ఈ క్రమంలోనే విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇవ్వగా తనకు ఆరోగ్యం బాగుండటంలేదని కోర్టు విచారణకు హాజరుకాలేనని ప్రగ్యా ఠాకూర్ తెలిపారు. ఇక ఈ వీడియో మ్యాటర్‌కు వస్తే మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో ఇద్దరి అమ్మాయిల వివాహం ఒకే ముహూర్తానికి జరుగుతోంది. ఆ అమ్మాయిలది పేద కుటుంబం కావడంతో ప్రగ్యా ఠాకూర్ తన నివాసంలోనే వివాహం జరిపిస్తున్నారట. ఈ సమయంలోనే డప్పుల మోతకు ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కాలు కదిపారు. చిన్నపాటి స్టెప్పులు వేస్తూ అలరించడమే కాదు, పెళ్లికి వచ్చిన వారిని కూడా తనతో పాటు కలిసి డ్యాన్స్ చేయాలని పిలిచారు. ఆ డ్యాన్స్ ను ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
కోర్టు విచారణకు హాజరుకావడానికి అనారోగ్య కారణాలను సాకుగా చూపుతుంటారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఆమెను ఇలా చూస్తుంటే, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే ప్రగ్యా ఠాకూర్ తమ వివాహం తన ఇంట్లో చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని పెళ్లి కుమార్తెలు చెప్పారు. ఇలాంటి అదృష్టం చాలా తక్కువమందికి ఉంటుందని అన్నారు. తనది రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమని, ఆ సమయంలో తన కుమార్తె పెళ్లి చేసే స్తోమత తనకు లేదని ఓ పెళ్లి కుమార్తె తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తానే దగ్గరుండి ఈ వివాహం జరిపించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆ తండ్రి చెప్పాడు. ఎంపీ సహాయం చేసుండకపోతే తమ కుమార్తెలకు పెళ్లిళ్లు జరిగేవి కావని.. ప్రగ్యా ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.