Begin typing your search above and press return to search.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సంచలనం.. వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్టు!
By: Tupaki Desk | 11 Feb 2023 10:24 AM GMTఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. వరుస అరెస్టులతో హడలెత్తిస్తోంది. తాజాగా ఈ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవను అరెస్టు చేసింది. ఈ మేరకు ఆయనను ఢిల్లీలో అరెస్టు చేసింది.
ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో రాఘవను ప్రశ్నించాక అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది. అలాగే ఫిబ్రవరి 11న రాఘవను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనుంది. అదేవిధంగా ఈ కేసు విచారణకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మాగుంట రాఘవను కూడా కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
వారం రోజుల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం మల్హోత్ర అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా రాఘవ ప్రస్తుతం బాలాజీ గ్రూపు యజమానిగా ఉన్నారు. కాగా దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే సుమారు 9 మంది అరెస్టు అయ్యారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సౌత్ గ్రూప్.. మాగుంట రాఘవరెడ్డి పేరును ప్రస్తావించినట్లు సమాచారం.
కాగా ఇదే కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని గతేడాది అక్టోబర్‌లోనే సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనతోపాటూ.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగి రాఘవను అందుపులోకి తీసుకుంది.
మధ్యవర్తుల ద్వారా ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని మాగుంట రాఘవపై ఆరోపణలు. ఈ నేపథ్యంలో గత రెండ్రోజులుగా రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన సరిగా సహకరించట్లేదనే ఉద్దేశంతో అరెస్టు చేసినట్టు సమాచారం.
కాగా సౌత్ గ్రూప్ కు సంబంధించి అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, రాఘవరెడ్డి ఇప్పటివరకూ అరెస్ట్ అయ్యారు. కాగా మాగుంట రాఘవ విషయానికొస్తే.. బాలాజీ డిస్టిలరీస్ కాకుండా, ఏంజెల్ షాంపైన్ ఎల్‌ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలపై సీబీఐ దృష్టి సారించిందని చెబుతున్నారు. మద్యం తయారీ, పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు ఈ కుంభకోణంలో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే చారియట్ మీడియాకు చెందిన రాజేశ్ జోషి అనే వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. అలాగే మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈయన గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పీఏగా పనిచేయడం గమనార్హం.
కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు ఫిబ్రవరి 8 అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.