Begin typing your search above and press return to search.
టీడీపీతో కలిసేందుకు రెడీనా....జీవీఎల్ చెప్పినదేంటి...?
By: Tupaki Desk | 19 May 2023 10:14 PM GMTబీజేపీకి కర్నాటక ఎన్నికల ఫలితాలు మత్తుని వదిలించినట్లుగా ఉన్నాయనుకోవాలి.తమకు బలం ఉందా అంటే లేదు వాపు మాత్రమే అని తేల్చేసినట్లున్నాయి. మోడీ చరిష్మా సౌతిండియాలో అసలు పనిచేయదు అన్నది కూడా అర్ధం అయినట్లుగా ఉంది. మొత్తానికి పవన్ మాటలను మేము చెవికెక్కించుకున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. అందునా టీడీపీతో పొత్తు అన్న మాటలని వింటేనే మండిపోయే ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటి వారు అయితే బాగా మెత్తబడిపోయారు.
పవన్ పొత్తుల మీద ఇచ్చిన సూచనలను కేంద్ర నాయకత్వం దృష్టిలోకి తీసుకెళ్తామని జీవీఎల్ చెప్పడం బట్టి చూస్తూంటే 2014 నాటి పొత్తులనే 2024 ఎన్నికల్లో రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తున్నట్లుగా ఉంది. ఇటీవల పవన్ పొత్తుల గురించి అన్న మాటలు చూస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలసి పోటీ చేస్తాయని, ఓట్ల చీలికను అరికడతాయని చెప్పుకొచ్చారు.
దాని మీద విశాఖలో మాట్లాడినపుడు కూడా జీవీఎల్ ఇదే రకంగా రియాక్ట్ అయ్యారు. ఇపుడు కూడా ఆయన అదే అంటున్నారు. పొత్తుల విషయంలో జాతీయ నాయకత్వానిదే ఫైనల్ అని అంటున్నారు. వాస్తవానికి ఏపీ బీజేపీలో చూస్తే టీడీపీ అనుకూల వర్గం వ్యతిరేక వర్గం ఉందని అంటున్నారు. ఆ వ్యతిరేకవర్గంలో జీవీఎల్ సోము వీర్రాజు కీలకంగా ఉంటున్నారు. ఇపుడు ఇద్దరూ తన టోన్ డౌన్ చేసి మాట్లాడుతున్నారు.
పొత్తుల విషయం జాతీయ నేతలే చూసుకుంటారు అని వారు అన్నపుడు ఇక టీడీపీతో లైన్ క్లియర్ అయినట్లే అని అనుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా వీలైతే ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తులతో ముందుకు సాగాలని చూస్తోందని టక. ఆ విధంగా చేయకపోతే బీజేపీ కి సౌత్ లో ఉనికి లేకుండా పోతుందన్న ఆందోళన వారికి కలుగుతోంది.
దాంతో ఇపుడు ఎలా చూసుకున్నా రోగి కోరింది వైద్యుడు ఇచ్చినది ఒక్కటే మందు అన్నట్లుగానే పరిస్థితి ఉంది అనుకోవాలి. అందుకే పొత్తుల విషయంలో బీజేపీ నేతల మాటలు చూస్తే టీడీపీకి తమ మీద ఉన్న మోజు తగ్గకుండా పొత్తు అనిపించేసుకుంటే చాలు అన్నట్లుగానే సీన్ ఉంది అంటున్నారు. ఇంకో వైపు గతంలో ఎన్నడూ లేని విధంగా జీవీఎల్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం మీద గట్టిగానే విరుచుకుపడ్డారు.
అవినీతి అరాచక పాలన ఏపీలో సాగుతోందని, అన్ని విధాలుగా ఏపీలోని ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ని మూటకట్టుకుందని కూడా వారు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన ఇళ్లను సైతం పూర్తి చేసే తీరుబాటు లేదని అంటోంది. టిడ్కో ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదు, కేంద్రం ఇచ్చిన 22 లక్షల ఇళ్ళ సంగతి ఏంటి అని సోము ప్రశ్నిస్తున్నారు ప్రతీ నియోజకవర్గానికి చార్జిషీట్ పెట్టి మరీ వైసీపీ అవినీతి భాగోతాలను బయటపెడుతున్నామని అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే ఏపీ బీజేపీ నేతలు గొంతు సవరించుకున్నారు. మరి ఇది కాస్తా కొత్త పొత్తులకు దారి తీసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.