Begin typing your search above and press return to search.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి తాజా హెల్త్ బులెటిన్.. వైద్యులు చెప్పిందిదే!
By: Tupaki Desk | 25 May 2023 3:57 PM GMTకడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ ను విడుదల చేశారు. గత మూడు రోజుల్లో శ్రీలక్ష్మి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని వెల్లడించారు. వాంతులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా ఎలాంటి సమస్యలు కనిపించలేదని వివరించారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి నోటిద్వారానే ఆహారం తీసుకుంటున్నట్లు వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. బీపీ, పల్స్, శ్వాస తీసుకోవడం తదితర అంశాలన్నీ సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆమెను సీసీయూ నుంచి సాధారణ వార్డుకు షిప్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాగా, పులివెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాష్ తల్లి మే 19న ప్రార్థన చేస్తూ ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికంగా ఉన్న దినేశ్ నర్సింగ్ హోంలో ఆమెనున చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ బయలుదేరగా పరిస్థితి విషమించడంతో ఆమెను కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. పులివెందులకు చెందిన కార్డియాక్ నిపుణుడు హితేశ్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రవి కళాధర్ రెడ్డి పర్యవేక్షణలో అవినాష్ తల్లి శ్రీలక్ష్మికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
తన తల్లి అనారోగ్యం నేపథ్యంలో మే 19న సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందుకుల బయలుదేరి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మార్గమధ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపాన అంబులెన్సులో తన తల్లిని అవినాష్ ఆమెను కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. మే 19 నుంచి విశ్వభారతి ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి ఉంటున్నారు.
మరోవైపు సీబీఐ ఆయనను విచారణకు హాజరుకావాలని ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు. ముందు మే 16న విచారణకు రావాలని కోరగా తనకు ముందస్తు షెడ్యూల్ మేరకు ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని తాను రాలేనని అవినాష్ వెల్లడించారు. ఆ తర్వాత మే 19న విచారణకు హాజరు కావాలని కోరగా తన తల్లి అనారోగ్యంతో ఉందని ఆయన విచారణకు హాజరు కాలేదు. ముచ్చటగా మూడోసారి మే 22న విచారణకు రావాలని కోరగా అప్పుడు కూడా ఆయన హాజరుకాలేదు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని.. తాను ఆస్పత్రిలోనే ఉన్నానని.. ఆయన తెలిపారు.
మరోవైపు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మే 25న అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచిచూడాల్సిందే.