Begin typing your search above and press return to search.
డ్రగ్స్ దందాలో సినీలింకులు.. తెరపైకి కీలక విషయాలు!
By: Tupaki Desk | 15 Jun 2023 12:05 PM GMTతవ్వేకొద్దీ బయటపడుతున్నాయి.. వెతికే కొద్దీ దొరుకుతున్నాయి.. విచారించే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి "డ్రగ్స్ దందాల్లో సినీ లింకులు"! ఇప్పటికే 2017లో తెలుగు సినీ పరిశ్రమను మాదకద్రవ్యాల వ్యవహారం ఉక్కిరిబిక్కిరి చేసిందనే వ్యవహారాలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి తాజాగా "డ్రగ్స్ వ్యవహారంలో సినీ జనాలు" అనే వ్యవహారం తెరపైకి వచ్చింది.
అవును... గతంలో జరిగిన రచ్చకు సంబంధించిన చర్చ సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా మరోసారి నైజీరియన్ల మత్తు దందాతో సినీ పరిశ్రమకు లింకులున్నట్టు ఆధారాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే అరెస్టయిన రోషన్ ఫోన్ లో లభించిన ఆధారాలతో కేపీ చౌదరిని పట్టుకున్న పోలీసులు అనేక కీలక విషయాలు గుర్తించినట్లు తెలుస్తుంది.
గోవా కేంద్రంగా మాదకద్రవ్యాల సరఫరా కీలక సూత్రధారి నైజీరియన్ పెటిట్ ఎబ్యూజర్ అలియాస్ గాబ్రియేల్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు.. అతడితో టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరికి సన్నిహిత సంబంధాలున్నట్టు గుర్తించారు. ఏడేళ్లుగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లోని పలువురితో అతడికి దగ్గర సంబంధాలున్నాయని తెలిపారు.
కేపీచౌదరి గోవాలో హోటల్ ప్రారంభించినప్పుడు నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయంట. వాటి ఆధారంగా అంతర్జాతీయ డ్రగ్ డీలర్లకు దగ్గరయ్యాడట. ఈ సందర్భంగా... దాదాపు ఏడాదికాలంగా ఏపీ, తెలంగాణకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు ఇతడి వద్దనే ఖరీదైన కొకైన్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో పలువురు ప్రముఖులు కిక్ కోసం మత్తుకు అలవాటు పడుతున్నారంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. డబ్బు విపరీతంగా ఉండటమో.. లేక, అంతకు మించిన మత్తుకు బానిసవ్వాలనే తాపత్రయమో తెలియదు కానీ... ఈ మధ్య ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంటుంది! ఈ సమయంలో ఈ మత్తు కోసం గోవాని ఆశ్రయిస్తున్న పలువురు ప్రముఖులు అక్కడ నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఖరీదైన డ్రగ్స్ ని నగరానికి తీసుకొస్తున్నారు.
ఈ జాబితాలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులే అధికంగా ఉంటున్నారని చెబుతుంటారు పోలీసు అధికారులు! ఈ క్రమంలో వీకెండ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు, ఫాం హౌస్ పార్టీలు అంటూ కొంతమంది కొత్త వారికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. అందులో భాగంగా మొదట్లో ఉచితంగా రుచి చూపుతున్నారు. మత్తుకు అలవాటుపడ్డాక వారినే కస్టమర్లుగా మార్చుకుంటున్నారు. ఫలితంగా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.
ఈ వ్యాపారం వల్ల రెట్టింపు లాభాలు ఉండటంతో అధికశాతం వ్యాపార వర్గాల వారు ఈ దిశగా ఆకర్షితులవుతున్నారని పోలీసులు చెబుతున్నారు. కారణం... గోవాలో గ్రాము కొకైన్ రూ.7000 ఉంటే... అది కాస్త హైదరాబాద్ కి చేరిన తర్వాత రూ.15,000-18,000 అవుతుంది. ఇక హెరాయిన్ గ్రాము గోవాలో రూ.3,500 ఉంటే... ఇక్కడకు వచ్చాక రూ.7000 ధరకు అమ్ముతున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి ఫోన్లలో సినీ రంగానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు, నలుగురు నటీమణులు, ప్రముఖ దర్శకుడి ఫోన్ నంబర్లు, ఫొటోలను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్ గా మారుతుంది!