Begin typing your search above and press return to search.

కేసీఆర్ నాయకుడైంది ఎన్టీఆర్ వల్లే.. ఆ కృతజ్ఞత ఉంటే ఎన్టీఆర్ ఘాట్ కి రావాలి.. మోత్కుపల్లి వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Jan 2021 8:31 AM GMT
కేసీఆర్ నాయకుడైంది ఎన్టీఆర్ వల్లే.. ఆ కృతజ్ఞత ఉంటే ఎన్టీఆర్ ఘాట్ కి రావాలి..  మోత్కుపల్లి వ్యాఖ్యలు
X
బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు నిజంగా కృతజ్ఞత ఉంటే ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చి ఆయనకు నివాళులు అర్పించాలని వ్యాఖ్యానించారు. ఇవాళ ఎన్టీఆర్ 25 వ వర్ధంతి ఈ సందర్భంగా మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని ఆయన సమాధికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిపై విమర్శలు చేశారు.

ఎన్టీఆర్ వల్లే కేసీఆర్ ఇంతటి నాయకుడు అయ్యాడని, నిజంగా ఆయనపై కృతజ్ఞత ఉంటే ఎన్టీఆర్ ఘాట్ కి రావాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించి ఆయన రుణం తీర్చుకోవాలని అన్నారు.ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు అమలు చేసి బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నాడు అని మోత్కుపల్లి అన్నారు.

ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో చేశారని, ఆయన శిష్యుడిగా తానేంతో గర్విస్తున్నానన్నారు. ఆయన పాలనలోనే వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. జాతీయ రాజకీయాలను సైతం శాసించి, ఆ పార్టీలతో ను ఎన్టీఆర్ పోటీ పడ్డారని అన్నారు. తెలుగోడి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.