Begin typing your search above and press return to search.

నా కూతురికి ఎక్కువమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.. కోర్టులో తల్లి షాకింగ్ వాదన

By:  Tupaki Desk   |   9 April 2021 6:59 AM GMT
నా కూతురికి ఎక్కువమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.. కోర్టులో తల్లి షాకింగ్ వాదన
X
పిల్లలు తప్పు చేస్తే.. తల్లి కడుపులో దాచి పెట్టుకొని ఉంటుందంటారు. తనను ఎన్ని అవమానాలకు గురి చేసినా.. కష్టాలు పెట్టినా.. పిల్లల గురించి తల్లులు పాజిటివ్ గానే స్పందిస్తారు తప్పించి.. అందుకు భిన్నంగా వ్యవహరించే వారు చాలా చాలా తక్కువగా ఉంటారు. తాజాగా ఉదంతం అలాంటి అరుదైన విషయానికి సంబంధించిందే. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లనున్న కుమార్తెపై ఆమె తల్లి ముంబయి హైకోర్టులో కేసు వేసింది. గృహ హింస ఆరోపణలు చేసింది. సంచలనం గా మారిన ఈ కేసు ఉదంతం లోకి వెళితే..

ముంబయి నగరానికి చెందిన మహిళ ఒకరు బాంబే హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో తన కుమార్తెపై ఆమె పలు ఆరోపణలు చేశారు. పిటిషనర్ తరఫున కెన్నీ థక్కర్ అనే లాయర్ ను పెట్టుకున్నారు. తల్లిని దారుణంగా వేధించేదని.. కష్టాలు పెట్టేదని.. తిట్టు తిట్టేదని.. అన్నం కూడా పెట్టేది కాదని ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు. తాము చేస్తున్న ఫిర్యాదులకు సంబంధించి కోర్టులో మాత్రం ఆధారాల్ని చూపించలేకపోయారు.

ఈ సందర్భంగా పిటిషన్ దారు లాయర్ తన వాదనల్ని మరింత పెంచుతూ.. తన పిటిషనర్ కుమార్తెకు ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. దీంతో.. న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు నడుస్తోంది క్యారెక్టర్ మీద కాదని.. లా పాయింట్ల మీద మాట్లాడాలని లాయర్ కు చీవాట్లు పెట్టారు. ‘ఇదేం పిచ్చి వాదన. అది ఆమె జీవితం. ఆమె ఇష్టం. ఆమెకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్న దాని గురించి ఇక్కడ అవసరం లేదని ఘాటుగా రియాక్టు అయ్యారు. దీంతో.. సదరు లాయర్ కోర్టుకు క్షమాపణలు చెప్పారు.

తన పిటిషనర్ కుమార్తె త్వరలో ఆస్ట్రేలియా వెళ్లనుందని.. వీసా కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లుగా ఆమె తరఫు లాయర్ పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం ఆమె విదేశాలకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. కుమార్తె ఫారిన్ లో చదువుకుంటే తల్లి గర్వపడాలంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఈ నెల 19కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.