Begin typing your search above and press return to search.
ఇద్దరు పిల్లల్ని తోసేసి.. తాను సూసైడ్ చేసుకున్న ఆమె గురించి తెలిస్తే కన్నీళ్లే
By: Tupaki Desk | 20 Jun 2023 10:24 AM GMTఅయ్యో అనిపించే ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. డబ్బు మీద పేరాశ.. అత్తారింటి ఆస్తి మీద కన్ను మూడు నిండు ప్రాణాలు గాల్లో కలిసేలా చేశాయి. పెళ్లైన నాటి నుంచి అందంగా లేవన్న ఈసడింపులు.. వేధింపుల్ని భరించలేకపోయిన ఆమె.. తన కవలల్ని చంపేసి.. తాను చనిపోయిన దారుణ ఉదంతం హైదరాబాద్ మహానగరిలో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి పోలీసు అధికారులు చెబుతున్న వివరాల్ని చూస్తే..
సిద్దిపేట జిల్లా రామంచకు చెందిన వేమన్న.. దుర్గమ్మ దంపతులు ముప్ఫై ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు. బన్సీలాల్ పేటలో వారి నివాసం. వారికి నలుగురు కుమార్తెలు. ప్రైవేటు జాబ్ చేసే వేమన్న తన స్థాయికి తగ్గట్లుగా పిల్లలకు ఘనంగానే పెళ్లిళ్లు చేశారు. మూడేళ్ల క్రితం చిన్న కుమార్తె సౌందర్యకు సిద్దిపేట జిల్లాకు చెందిన గణేశ్ కు ఇచ్చి పెళ్లి చేశారు.
కట్నంగా రూ.2.5 లక్షలు..కాస్తంత బంగారం ఇచ్చి పెళ్లి జరిపారు. వారిద్దరు ఉప్పల్ లోని భరత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఒక సెలూన్ లో పని చేసే గణేశ్.. పెళ్లైన కొంతకాలం నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు మొదలు పెట్టాడు. ఏడాదిన్నర క్రితం కవలలకు జన్మనిచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. పలుమార్లు పుట్టింటి నుంచి ఎంత డబ్బులు తెచ్చినా అతడి ఆశ తీరలేదు.
ఇది సరిపోనట్లు అందంగా లేవంటూ తరచూ వేధింపులకు గురి చేసేవాడు. ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇంటిని తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో యాదాద్రికి సమీపంలో ఉన్న భూమిని సౌందర్య పేరుత మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.
అయినా.. అతడి ఆశ చావలేదు. 25 రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన సౌందర్యను డబ్బుల కోసం అదే పనిగా ఫోన్లో వేధింపులకు గురి చేసేవాడు. దీంతో.. కుటుంబ సభ్యులు సూచనతో గాంధీనగర్లో అతడిపై పోలీసు కేసు నమోదైంది.
సోమవారం ఉదయం 11 గంటల వేళలో భర్త పని చేస్తున్న సెలూన్ కు వెళ్లిన సౌందర్య.. తనను ఇంటికి తీసుకెళ్లాలని కోరితే అందుకు గణేశ్ నో చెప్పాడు. దీంతో.. తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం.. పిల్లలతో సహా ఎనిమిదో అంతస్తుకు చేరి.. మొదట పిల్లల్ని కిందకు తోసేసి.. ఆ వెంటనే తాను కిందకు దూకేసింది. దీంతో.. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దీంతో.. వారి డెడ్ బాడీలను గాంధీకి తరలించారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మూడు నిండు ప్రాణాల్ని తీసిన ఇలాంటి ధనపిశాచికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే అన్న మాట వినిపిస్తోంది.