Begin typing your search above and press return to search.

కారుణ్య మరణానికి తల్లి దరఖాస్తు.. గంటలోపే విగత జీవిగా కుమారుడు

By:  Tupaki Desk   |   2 Jun 2021 2:30 AM GMT
కారుణ్య మరణానికి తల్లి దరఖాస్తు.. గంటలోపే విగత జీవిగా కుమారుడు
X
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా తన కుమారుడి నరకయాతనకు పరిష్కారం దొరకలేదని ఓ తల్లి గుండె అవిసిపోయింది. తొమ్మిదేళ్ల ఏళ్ల చిన్నారి నాలుగైదేళ్లుగా నరక చూస్తుండడం ఆ తల్లి తట్టుకోలేకపోయింది. చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసింది. అప్పులు చేసి మరీ వైద్యం చేయించింది. అయినా లాభం లేదు. తన గారాల కొడుకు కళ్ల ముందే శారీరక నరకం చూడడం... మానసికంగా తామూ బాధపడడం కన్నా కారుణ్య మరణమే శరణ్యమనుకుంది ఆ తల్లి.

నా బిడ్డ బాధను చూడలేకపోతున్నాం జడ్జి గారు మీరే న్యాయం చేయాలంటూ పుంగనూరు జడ్జికి దరఖాస్తు చేసింది ఆ తల్లి. దరఖాస్తు చేసిన గంటలోపే తన కుమారుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. కోర్టు నుంచి తిరిగి వెళ్తుండగా నే ఆ చిన్నారి విగత జీవిగా మారాడు. ముద్దులొలికే తన చిన్నారి ప్రాణాలు చేతిలోనే పోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బీర్నెపల్లికి చెందిన అరుణ కుమారుడు హర్ష వర్ధన్(9) అరుదైన రక్త సంబంధిత వ్యాధితో నాలుగేళ్లుగా బాధపడుతున్నాడు. పాఠశాలలో ఉండగా ఈ వ్యాధి నిర్ధరణ అయింది. అప్పటి నుంచి వీరు తిరగని ఆస్పత్రి లేదు. కుమారుడిని బాగు చేయడం కోసం రూ.లక్షల్లో అప్పులు చేసి మరీ వైద్యం చేయించారు. కానీ ఆ చిన్నారి పరిస్థితి ఏమాత్రం మెరుగవలేదు. ఆ బిడ్డపై తండ్రి ఆశలు వదిలేసుకున్నా అమ్మ మాత్రం చివరి అవకాశం వరకూ పోరాటం చేసింది. ఎంతకీ ఫలితం లేకపోవడంతో చివరకు కోర్టునాశ్రయించింది.

ఉన్నా ఆస్తులు పోయాయి. మరోవైపు పెరుగుతున్న అప్పులు... చేసేది ఏం లేదంటూ చేతులెత్తేసిన వైద్యులు... అంతేకాకుండా కళ్లముందే కుమారుడి నరకయాతన చూసిన ఆ తల్లి చివరి అవకాశంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన బిడ్డ బాధ చూడలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుంది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ పుంగనూరు కోర్టుకు వెళ్లింది. అలా దరఖాస్తు చేసి తిరిగి ప్రయాణం అయిన గంటలోపే ఆ చిన్నారి విగత జీవిగా మారాడు. చేతిలోని బిడ్డ చేతిలోనే ఈ లోకాన్ని విడిచి పోవడంతో ఆ తల్లి పడే క్షోభ వర్ణనాతీతం. ఈ హృదక విదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.