Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి ..'మోదీ స్టేడియం'గా నామకరణం!

By:  Tupaki Desk   |   24 Feb 2021 8:33 AM GMT
ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి ..మోదీ స్టేడియంగా నామకరణం!
X
భారతదేశ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈరోజు వర్చువల్‌ విధానం ద్వారా గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో నిర్మించిన సర్దార్‌ పటేల్‌ (మొతేరా) స్టేడియంను ప్రారంభించారు. కొత్త స్టేడియానికి న‌రేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్ట‌డం గ‌మ‌నార్హం ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు, గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్ పాల్గొన్నారు. అహ్మ‌దాబాద్‌లోని ఈ స్టేడియాన్ని పున‌రుద్ధ‌రించిన విష‌యం తెలిసిందే. ల‌క్షా ప‌ది వేల సామ‌ర్థ్యంతో ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు సృష్టించింది. రూ.800 కోట్ల వ్యయంతో నిర్మితమైన మొతేరా స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ చూసే అవ‌కాశం ఉంఉటంది.

ఈ స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ భారత్‌ ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ఇక్కడ బుధవారమే ఆరంభం కానుంది. అసలే భారీ స్టేడియం.. పైగా డేనైట్‌లో, గులాబి బంతితో మ్యాచ్‌ జరగబోతుండటం క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న చివరి రెండు టెస్టులతో పాటు టీ20 సిరీస్‌ కు మొతేరానే వేదిక. ఈ స్టేడియం ఇప్పుడు ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇప్పుడు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న మూడో టెస్టుతో అంతర్జాతీయ మ్యాచ్‌కి తొలిసారి వేదిక కాబోతోంది. గుజరాత్‌ లోని సబర్మతి నది ఒడ్డున 1982లో దీనిని నిర్మించారు. అక్టోబరు 2015లో దీనిని పునరుద్ధరించాలని, సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ షేర్‌ చేస్తోంది. పునరుద్ధరణకు ముందు ఈ స్టేడియం సామర్థ్యం 49 వేలు మాత్రమే. ఇప్పుడు దీని సామర్థ్యం రెండింతలకు పెరిగింది. చారిత్రక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియం సామర్థ్యం 90 వేలే కాగా, ఇప్పుడు దీనిని మొతేరా స్టేడియం అధిగమించింది. మొతేరా స్టేడియంలో లక్షా పది వేల మంది కూర్చొని హాయిగా మ్యాచ్‌ చూడొచ్చు. మొతేరా మైదానాన్ని 63 ఎకరాల్లో నిర్మించారు. దీనికి నాలుగు ప్రవేశద్వారాలు ఉన్నాయి. నాలుగు డ్రెస్సింగ్‌ రూమ్ ‌లతో పాటు ఆరు ఇండోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌ లు ఉన్నాయి., ఇక మూడు అవుట్‌ డోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌ లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద స్టేడియంగా చెబుతున్నారు.