Begin typing your search above and press return to search.

దేశంలోనే అత్యంత ఖరీదైన చీర కట్టింది ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   30 April 2023 12:46 PM GMT
దేశంలోనే అత్యంత ఖరీదైన చీర కట్టింది ఎవరో తెలుసా?
X
ప్రపంచంలోనే టాప్ 10 కుబేరుడు ఆయన. దేశంలోనే తొలి స్థానంలో ఉండేవాడు. అలాంటి కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య కూడా అంతే స్టేటస్ మెయింటేన్ చేస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర ధరించారు. దీంతో నీతా అంబానీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చేరారు.

నీతా అంబానీ వేసుకునే డ్రెస్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటికి సపరేట్ ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు. నీతా వేసుకునే లెహంగాలు, చీరలకు సరిపడే బ్లౌజులు అన్నీ ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటిని బంగారు జరీ, ఖరీదైన పెయింటింగ్స్ తో అలంకరిస్తారు. రూ.40 లక్షల విలువైన చీర కట్టుకున్న నీతా అంబానీని చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ చీర బంగారు జరీ వర్క్ తో ఉంది. బ్లౌజ్ పై ఖరీదైన పెయింటింగ్ డిజైన్ ఉంది. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. ఈ చీర ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధి చెందింది. కంచి సిల్క్, డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. ఈ చీర ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధ కంచి సిల్క్, చక్కటి బంగారు లేస్ లు ఉపయోగించారు. ఈ చీర పచ్చ, కెంపు, పుష్యరాగం, ముత్యాలు పొదిగిన రాళ్లతో దృష్టిని ఆకర్షించేలా రూపొందించబడింది.

ఈ చీర నేయడానికి కాంచీపురం నుంచి 36 మంది కళాకారులు కలిసి పనిచేశారు. ఈ చీర దాదాపు ఏడాది పాటు కళ్లు చెదిరేలా డిజైన్ చేయబడింది. ఈ చీరను నీతా అంబానీ ఇటీవల పరిమళ్ నత్వానీ కుమారుడి వివాహానికి హాజరైనప్పుడు కట్టుకుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఈ పెళ్లిలో నీత గులాబీ రంగు చీరలో ధగధగ మెరిసిపోయింది. అద్భుతమైన లెహంగాలో ఆమె చాలా అందంగా కనిపించింది.

జర్ధోసి, చికంకారీ ఎంబ్రాయిడరీతో డ్రెస్ ను అలంకరించారు. పటోలా పట్టు, స్ఫటికాల వంటి అలంకారాలు దుస్తులను అలంకరించాయి. ఆమె ధరించిన నెక్లెస్ మాత్రం వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చీర కోసం నీతా దాదాపు రూ.1.70 లక్షలు ఇచ్చారు. ముత్యాలుపొదిగిన నెక్లెస్, కొన్ని బ్యాంగిల్స్ తో తనను తాను యాక్సెసరైజ్ చేసుకుంది. నీతా అంబానీ తన పెద్ద కొడుకు ఆకాష్ పెళ్లిలో డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన పింక్ లెహంగా ధరించింది. అద్భుతమైన కళాకృతితో లెహంగాకు సరిపోలుతూ బ్లౌజ్ పై శుభరంబ్, ఆకాశ్-శ్లోక అని రాశారు. వజ్రాలు, పచ్చలతో హారాన్ని ధరించారు. ఈ లెహంగా కూడా లక్షల్లో డిజైన్ చేయబడింది.

ఇక ఇషా అంబానీ పెళ్లి కోసం కూడా వెడ్డింగ్ లెహంగా రూ.90 కోట్లు ఖర్చు చేసి ఆమె తల్లి నీతా అంబానీ పెళ్లి దుస్తులను తయారు చేశారు. ఇది ఇప్పటివరకూ నిర్మించిన అత్యంత ఖరీదైన లెహంగా అయితే నీతా అంబానీ చీర ఇప్పటికీ ఫ్యాషన్ ప్రపంచంలో సందడి చేస్తోంది.