Begin typing your search above and press return to search.
అవినీతిలో తెలంగాణకు 5వ ర్యాంక్.. ఇదేంది కేసీఆర్?
By: Tupaki Desk | 29 Nov 2019 4:57 AM GMTపోరాడి సాధించుకున్న తెలంగాణలో అవినీతి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. ప్రభుత్వ నిక్కచ్చిగా ఉందని గతంలో ప్రధాని మోడీ చేసిన ప్రశంసను మర్చిపోలేం. ప్రభుత్వంలో అవినీతి ఎంతన్నది పక్కన పెడితే తాజాగా ఇండియా కరప్షన్ 2019 పేరుతో ఒక సర్వేను నిర్వహించారు. ఇందులో 2018 అక్టోబరు నుంచి నవంబరు 2019 మద్యన నిర్వహించారు. 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో 1.9లక్షల మంది స్థానిక ప్రజలు.. సోషల్ మీడియా నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ర్యాంకుల్ని నిర్ణయించారు.
ఊహించని విధంగా తెలంగాణలో దారుణమైన రీతిలో అవినీతి ఉందన్న విషయం ఈ రిపోర్టు పేర్కొంది. తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. 67 శాతం అవినీతితో ఉందని.. నూటికి 67 శాతం మంది ప్రజలు తమ పనుల్ని పూర్తి చేసుకోవటం కోసం అధికారులకు లంచాలు సమర్పించుకుంటున్న వైనాన్ని గుర్తించారు.
దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రంగా రాజస్థాన నిలిస్తే.. రెండో స్థానంలో బిహార్.. మూడో స్థానంలో జార్ఖండ్ నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ.. మునిసిపల్.. పోలీసు శాఖల్లో అత్యధిక అవినీతి ఉందన్న విషయం బయటకు వచ్చింది. తెలంగాణలో భూదస్త్రాల ప్రక్షాళన తర్వాత అవినీతి మరింత పెరిగిందన్న విమర్శ వినిపిస్తోంది.
తెలంగాణలో లంచం ఇచ్చిన 67 శాతం మందిలో 56 శాతం మంది రెండుసార్లు కంటే ఎక్కువసార్లు లంచం ఇవ్వటాన్ని గుర్తించారు. కొందరు నేరుగా అధికారులకే ఇవ్వగా.. మరికొందరు పరోక్షంగా చెల్లింపులు జరిపారు. 40 శాతం రిజిస్ట్రేషన్లు.. భూముల పనుల కోసం లంచం ఇస్తున్నారు. గత ఏడాదిలో లంచాలు ఇచ్చామని చెప్పిన వారి శాతం 43 కాగా.. ఈ ఏడాది అది కాస్తా 67 శాతానికి పెరిగినట్లుగా గుర్తించారు.
అవినీతిలో రాష్ట్రాల ర్యాంకింగ్ లో తెలంగాణ ఐదో స్థానంలో ఏంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం 13వ స్థానంలో నిలిచింది. ఏపీలో అవినీతి 50 శాతంగా తేల్చారు. ఇక.. అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాల్లో కేరళ నిలిచింది. అక్కడ అవినీతి కేవలం 10 శాతంగా తేల్చారు. కేరళ తర్వాత అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాలుగా గోవా (20).. ఒడిశా (40).. ఢిల్లీ (46) గా తేల్చారు.