Begin typing your search above and press return to search.

జ‌నాల‌క‌న్నా పార్టీలే ఎక్కువున్నాయే.. తెలంగాణ టాక్ ఇదే!!

By:  Tupaki Desk   |   27 Feb 2023 5:00 AM GMT
జ‌నాల‌క‌న్నా పార్టీలే ఎక్కువున్నాయే.. తెలంగాణ టాక్ ఇదే!!
X
తెలంగాణ‌లో మ‌రో 9 మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు చాలా ప్ర‌త్యేకత ఉం ది. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ మ‌ధ్యే పోటీ జ‌రిగింది. మ‌ధ్య‌లో చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవ‌డంతో ఎన్నిక‌లు యూట‌ర్న్ తీసుకుని.. కేసీఆర్ ల‌బ్ధి పొందార‌నే చ‌ర్చ న‌డిచిం ది. స‌రే.. ఆ ఎన్నికల సంగ‌తి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు మ‌రింత ప్రాధాన్యం ఉంది.

లెక్క‌కు మిక్కిలి పార్టీలు ఇప్పుడు తెలంగాణ‌లో దూకుడుగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈ సారి ఒంట‌రిపోరుతోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ కూడాఒంట‌రిగానే త‌న స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇక‌, క‌మ్యూనిస్టులు మాత్రం కేసీఆర్‌తో క‌లిసి న‌డ‌వాల‌ని భావిస్తున్నారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న పాద‌యాత్ర‌ల‌కు క‌మ్యూనిస్టులు సైతం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

దీంతో బీఆర్ ఎస్ కు కొంత బ‌లం చేకూరిన‌ట్టు అయింది. ఇక‌, మ‌రోపార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా ఈ ద‌ఫా పోటీ ఇచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మెజారిటీ నాయ‌కులు లేక‌పోయినా.. కొన్ని కొన్ని నియోజ క‌వ‌ర్గాల్లో మాత్రం గ‌ట్టి పోటీ అయితే.. ఇచ్చే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్నినియోజ‌క‌వ ర్గాల‌కే ప‌రిమిత‌మైన ఎంఐఎం పార్టీ మాత్రం ఈ ద‌ఫా 30 నుంచి 40 స్థానాల‌లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. ఇది కూడా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని అంటున్నారు.

ఇక‌, చిన్నా చిత‌కా పార్టీలైన‌.. ప్ర‌జాశాంతి పార్టీ, ఆప్ వంటివి కూడా పోటీ కి రెడీగానే ఉన్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు జ‌న‌సేన కూడా రెడీ అవుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశం గా మారింది. అయితే.. ఎక్క‌డ పోటీ చేస్తార‌నేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇలా.. ఏ విధంగా చూసుకు న్నా.. తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి ఎలా రాజుకుందో.. పార్టీలు కూడా అలానే ఉన్నాయి. మ‌రి జ‌నాలు వేటిని ఆద‌రిస్తారో చూడాలి.