Begin typing your search above and press return to search.
పోషకాల నిధి పుట్ట గొడుగుల కర్రీ.. కేజీ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
By: Tupaki Desk | 12 April 2022 2:30 AM GMTమన దగ్గర ఎక్కువగా పుట్ట గొడుగులు తనరు కానీ.. వాటిలో ఉండే పోషక విలువలు గురించి తెల్సిన వారు మాత్రం వీటిని ఆవురావురు మంటూ తినేస్తారు. అయితే ఈ పుట్ట గొడుగుల్లో ఫైబర్, విటామిన్ బి, డి, రిబోఫ్లేవిన్, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్, ఎర్గోషెన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, రాగి, పొటాషియం, బీటా గ్లూకాన్ మరియు పాలీఫెనాల్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ప్రీ బయోటిక్స్ గా పని చేస్తాయి. అలాగే జీర్ణ వ్యవస్థలో ఉపయోగించే ప్రో బయోటిక్ జీవుల అభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇంతటి పోషక విలువలు ఉన్న పుట్ట గొడుగులు సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. ఇందులోనూ చాలా రకాలు ఉంటాయి. వాటి రకాలను బట్టి ధరల్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. సాధారణ పుట్ట గొడుగులు అయితే కిలో 80 రూపాయలు ఉంటుంది. పుట్ట గొడుగుల్లోని రకాలను బట్టి 100, 200, 500, 1000 ఇలా సాగుతుంటుంది. కానీ మెర్చెల్లా గుచ్చి పుట్ట గొడుగులు మాత్రం కిలో 18 వేల రూపాయలుగా ఉంది. అయితే వాటి ధర మరీ ఎంత ఎక్కువగా ఉంది, అవెక్కడ దొరుకుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మోర్చెల్లా గుచ్చి పుట్ట గొడుగులు హిమాచల్ ప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో సహజంగా పెరుగుతాయి. వీటిలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల గెండె సంబంధిత జబ్బులు, డయాబెటిస్ వంటి రోగాలను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా రక్త హీనత, ఎముకలు గుళ్ల పడడం వంటి సమస్యలకు కూడా ఈ మార్చెల్లా గుచ్చి పుట్ట గొడుగులు మంచి ఔషధంగా పని చేస్తాయని వివరిస్తున్నారు.
అయితే ప్రస్తుతం వీటి లభ్యత తగ్గిపోయింది. కృత్రిమంగా పండించలేక పోవడంతో కేజీ ధర 18 వేలు పలుకుతోంది. కానీ వీటిని తినడం వల్ల అనేక రోగాలను అదుపులో ఉంచుకోవచ్చని.. దవాఖాన్లలో రోగాలు వచ్చాక పెట్టే డబ్బు కంటే వీటికి పెట్టడం మేలు అనుకునే వాళ్లు ధర ఎక్కువైన కొనుక్కొని తింటున్నారు. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి చేసే మేలు గుర్తించిన వాళ్లు.. లక్షాధికారులు వీటిని కొనుక్కొని వంటల్లో వాడుకుంటున్నారు.
రానూ రానూ ఈ మెర్చిల్లా గుచ్చి పుట్ట గొడుగుల ధరలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అక్కడి రైతులు, వ్యాపార వేత్తలు సూచిస్తున్నారు. మరి వీటి ధరలు ఇంకెంత మేర పెరుగతాయో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.