Begin typing your search above and press return to search.
తస్మాత్ జాగ్రత్త : ఈఎంఐ.. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకుంటే తడిసి మోపెడు!
By: Tupaki Desk | 1 April 2020 3:30 AM GMTకరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగు జీతాలపై ప్రభావం పడనుంది. కొన్ని సంస్థలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులకు ఈఎంఐ ఇంకా క్రెడిట్ కార్డుల బిల్లుల విషయంలో కఠినంగా వ్యవహరించవద్దంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. ఈఎంఐలు ఇంకా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకున్నా పర్వాలేదు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం జరిగింది.
కేంద్రం ఒక్క ప్రకటన చేసి వదిలి పెట్టింది. కాని ఇప్పటి వరకు బ్యాంకులతో కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు చర్చలు జరపలేదని.. ఈఎంఐలు ఇంకా క్రెడిట్ కార్డుల బిల్లులకు సంబంధించిన విషయమై మార్గదర్శకాలను ఇవ్వలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బిల్లులు కట్టకుంటే కఠినంగా వ్యవహరించక పోవచ్చు కాని ఈఐఎంలు కట్టకుంటే తదుపరి నెలల్లో వడ్డీ మరింత పెరిగే అవకాశం ఉందని మూడు నెలల తర్వాత ఆ భారం మోయలేనంతగా మారుతుందని అందుకే ఈఎంఐలు వీలైనంత వరకు చెల్లించుకుంటేనే ఉత్తమం అంటూ కొందరు ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మూడు నెలలు ఈఎంఐలు కట్టకున్నా వడ్డీ ఉండదు.. వడ్డన ఉండదు అంటూ బ్యాంకులు ప్రకటన చేయలేదు కనుక మూడు నెలల తర్వాత ఈ బిల్లులు తడిసి మోపెడు అయ్యే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఈవిషయమై స్పష్టమైన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు ఇస్తే తప్ప ఈఎంఐలు కట్టకుండా ఉండవద్దంటున్నారు. ఒక ఫైనాన్షియర్ విశ్లేషించిన దాని ప్రకారం లక్ష రూపాయల లిమిట్ తో కొనసాగే క్రెడిట్ కార్డులకు చెందిన బిల్లులను మూడు నెలలు చెల్లించనట్లయితే మూడు నెలల తర్వాత ఈ మూడు నెలల బిల్లుకు అదనంగా మరో 15 వేల రూపాయల వరకు లేట్ ఫీజ్ పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. కనుక ఈఎంఐలు చెల్లించనక్కర్లేదు అని సంకలు గుద్దుకుంటూ కట్టకుంటే ఆ తర్వాత పరిణామాలు తలకు మించిన భారం అవుతాయని హెచ్చరిస్తున్నారు.